జియోహాట్‌స్టార్ (JioHotstar) ఛానెల్‌తో మిథాలీ రాజ్ మాట్లాడుతూ— “భారత్‌కు ఇది నిరాశాజనకమైన మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే పట్టికలో అగ్రస్థానంలో నిలిచేవారు. కానీ ఇప్పుడు సెమీస్‌కు చేరాలంటే ఆస్ట్రేలియాపై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్ పరంగా చూస్తే, హర్మన్‌ప్రీత్ కౌర్ 5వ స్థానంలో అంత లేట్‌గా బ్యాటింగ్‌కు రావడం మనం తరచుగా చూడలేదు. కాబట్టి ఆమె 4వ స్థానంలో, జెమిమా 5వ స్థానంలో వస్తే బాగుంటుంది. జెమిమా గతంలో 5వ స్థానంలో ఆడి చాలా పరుగులు చేసింది. ఆమె క్రీజులోకి వచ్చే సమయానికి స్పిన్నర్లు బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. స్పిన్‌ను ఆడటం జెమిమా బలం. ఆమె క్రీజు వెలుపలికి వచ్చి ఆడటంతో పాటు స్కూప్స్, స్వీప్ షాట్లు బాగా ఆడుతుంది. హర్మన్‌ప్రీత్ ముందుగా వచ్చి, ఆ తర్వాత జెమిమా వస్తే ఆమెకు ఫామ్‌లోకి రావడానికి, మంచి రిథమ్ అందుకోవడానికి సహాయపడుతుంది” అని అన్నారు.













