Argentina Vs Austria: ఆస్ట్రియాతో అర్జెంటీనా ఢీ.. బరిలో మెస్సీ.. మ్యాచ్ ఎప్పుడంటే? | క్రీడా వార్తలు | ACTPnews

Argentina vs Austria FIFA World Cup 2026, Lionel Messi hat trick Argentina, How to watch Argentina vs Austria in India, ZEE5 FIFA World Cup live streaming, Unite8 Sports live football match, Ralf Rangnick Austria vs Argentina, Argentina vs Austria match time IST, FIFA World Cup 2026 Group J standings, Lionel Messi news today, Dallas Stadium World Cup fixtures, Lionel Scaloni Argentina team, Argentina vs Austria prediction, Free World Cup streaming India ZEE5, అర్జెంటీనా వర్సెస్ ఆస్ట్రియా, ఫిఫా ప్రపంచకప్ 2026, లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్, ఫుట్‌బాల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, రాల్ఫ్ రంగ్‌నిక్ కామెంట్స్

Last Updated:

ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. అతడి ఆట కోసం యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా ఎదురు చూస్తోంది.

Argentina vs Austria FIFA World Cup 2026, Lionel Messi hat trick Argentina, How to watch Argentina vs Austria in India, ZEE5 FIFA World Cup live streaming, Unite8 Sports live football match, Ralf Rangnick Austria vs Argentina, Argentina vs Austria match time IST, FIFA World Cup 2026 Group J standings, Lionel Messi news today, Dallas Stadium World Cup fixtures, Lionel Scaloni Argentina team, Argentina vs Austria prediction, Free World Cup streaming India ZEE5, అర్జెంటీనా వర్సెస్ ఆస్ట్రియా, ఫిఫా ప్రపంచకప్ 2026, లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్, ఫుట్‌బాల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, రాల్ఫ్ రంగ్‌నిక్ కామెంట్స్
Argentina vs Austria FIFA World Cup 2026, Lionel Messi hat trick Argentina, How to watch Argentina vs Austria in India, ZEE5 FIFA World Cup live streaming, Unite8 Sports live football match, Ralf Rangnick Austria vs Argentina, Argentina vs Austria match time IST, FIFA World Cup 2026 Group J standings, Lionel Messi news today, Dallas Stadium World Cup fixtures, Lionel Scaloni Argentina team, Argentina vs Austria prediction, Free World Cup streaming India ZEE5, అర్జెంటీనా వర్సెస్ ఆస్ట్రియా, ఫిఫా ప్రపంచకప్ 2026, లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్, ఫుట్‌బాల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, రాల్ఫ్ రంగ్‌నిక్ కామెంట్స్

Argentina Vs Austria Live Streaming: ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్-జె (Group J)లో భాగంగా సోమవారం రాత్రి డల్లాస్ స్టేడియంలో ఆస్ట్రియా, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్లు తలపడనున్నాయి. ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. అతడి ఆట కోసం యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా ఎదురు చూస్తోంది. అల్జీరియాతో జరిగిన పోరులో హ్యాట్రిక్ గోల్స్‌తో రెచ్చిపోయిన మెస్సీ.. ఈ మ్యాచ్‌లోనూ గోల్స్ చేస్తే చూడాలనే ఆకాంక్షతో అభిమానులు ఉన్నారు.

ఇక ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రియా జట్టు ప్రధాన కోచ్ రాల్ఫ్ రంగ్‌నిక్ (Ralf Rangnick) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పటిష్టమైన అర్జెంటీనాను ఓడించాలన్నా లేదా ఆ జట్టు చేతిలో ఓటమి నుంచి తప్పించుకోవాలన్నా, తాను ఆస్ట్రియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందెన్నడూ లేనంత అత్యుత్తమ ప్రదర్శనను (A-Game) రేపటి మ్యాచ్‌లో ఆటగాళ్లు ప్రదర్శించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

గ్రూప్ ‘జె’ లో ఆస్ట్రియా తన మొదటి మ్యాచ్‌లో జోర్డాన్‌ను ఓడించగా.. అర్జెంటీనా జట్టు అల్జీరియాపై 3-0 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ హాట్రిక్ గోల్స్ సాధించి ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం రెండు జట్లు చెరో 3 పాయింట్లతో సమంగా ఉన్నాయి.

అర్జెంటీనాలో బలహీనతలు లేవు

మ్యాచ్‌కు ముందు ఆదివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రంగ్‌నిక్ మాట్లాడుతూ— “లియోనెల్ స్కాలోని (అర్జెంటీనా కోచ్) బృందంలో మాకు ఎలాంటి బలహీనతలు కనిపించలేదు. వారి బలాలు అసాధారణమైనవి. వారి ఆటగాళ్లు రెండు మూడు రకాల విభిన్న వ్యూహాలతో ఆడగలరు. పైగా వారి జట్టులో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ (లియోనెల్ మెస్సీ) ఉన్నాడు. కాబట్టి మేము ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలవాలంటే రేపు చాలా ధైర్యంగా, వ్యూహాత్మకంగా బలంగా ఆడాలి” అని పేర్కొన్నారు. 1998 తర్వాత ఆస్ట్రియా జట్టు మళ్లీ ప్రపంచకప్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఆస్ట్రియా డిఫెండర్ స్టెఫాన్ పోష్ ప్రొటెక్టివ్ మాస్క్ ధరించి ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

మ్యాచ్ వివరాలు

తేదీ: జూన్ 22, 2026

సమయం: రాత్రి 10:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)

వేదిక: డల్లాస్ స్టేడియం, డల్లాస్

భారతదేశంలో ఈ మ్యాచ్‌ను ఎలా చూడాలి?

భారతదేశంలోని ఫుట్‌బాల్ అభిమానులు ఈ మ్యాచ్‌ను జీ (Zee) నెట్‌వర్క్‌కు చెందిన Unite8 Sports ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా ZEE5 యాప్, ZEE5 వెబ్‌సైట్ లో ఉచితంగా వీక్షించవచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports