Fire Accident: కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి దూకిన విద్యార్థులు.. 11 మంది సజీవ దహనం! | | ACTPnews

మంటల్లో కోచింగ్ సెంటర్ (PC: X.com)


Last Updated:

Fire Accident: ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో సోమవారం మధ్యాహ్నం ఒక వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దురదృష్టవశాత్తూ జరిగిన ఈ ఘటనలో కనీసం 11 మంది సజీవ దహనం అయ్యారు.

మంటల్లో కోచింగ్ సెంటర్ (PC: X.com)
మంటల్లో కోచింగ్ సెంటర్ (PC: X.com)

అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న ఒక కోచింగ్ సెంటర్‌లో సోమవారం మధ్యాహ్నం దాదాపు 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో, వాటిని అదుపు చేయడానికి హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్ వాహనంతో సహా మొత్తం 14 అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు.

ప్రాణాలు కాపాడుకునేందుకు మొదటి అంతస్తు నుండి దూకిన విద్యార్థులు

భవనమంతా దట్టమైన పొగ, మంటలు అలుముకోవడంతో లోపల ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడమే లక్ష్యంగా పలువురు విద్యార్థులు భవనం మొదటి అంతస్తు నుండి కిందికి దూకారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. లోపల చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా కిందికి దూకమని స్థానికులు అరవడం, మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్న దృశ్యాలు ఆ ప్రాంతంలో ఉన్న తీవ్ర భయాందోళనలను తెలియజేస్తున్నాయి.

ఒక స్థానిక నివాసి ‘పిటిఐ’ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ— “షార్ట్ సర్క్యూట్ లేదా ఏదైనా స్పార్క్ (నిప్పురవ్వ) వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు. దాదాపు ఏడు నుండి ఎనిమిది మంది విద్యార్థులు భవనం నుండి కిందికి దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. అయితే, ఇంకా 20 నుండి 25 మంది విద్యార్థులు లోపలే చిక్కుకుని ఉండవచ్చని భయపడుతున్నాము” అని తెలిపారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో కోచింగ్ సెంటర్‌ లోపల ఎంతమంది విద్యార్థులు ఉన్నారనే విషయాన్ని ఆయన అధికారికంగా ధృవీకరించలేదు.

ఆయన మీడియా సంస్థతో మాట్లాడుతూ— “ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మేము విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉన్నాము. లోపల ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. అగ్నిమాపక బృందం ఎక్స్‌కవేటర్ల (పొక్లెయిన్ల) సహాయంతో భవనం గోడను బద్దలు కొట్టి, లోపలికి ప్రవేశించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది” అని పేర్కొన్నారు. మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఫైర్‌ఫైటింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed