TG20 League: 4, 6, 6, 4, 6, 6.. ఆ కొట్టుడు ఏంది రా అయ్యా.. టీజీ20 లీగ్‌లో తొలి సెంచరీ బాదిన వరంగల్ వారియర్స్ కెప్టెన్ | క్రీడా వార్తలు | ACTPnews

PC: tg20official


Last Updated:

వరంగల్ వారియర్స్ ఓపెనర్, కెప్టెన్ అమన్ రావు పేరాల సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ మైదానంలో విధ్వంసం సృష్టించాడు. కేవలం 32 బంతుల్లోనే అమన్ శతకాన్ని బాదాడు.

PC: tg20official
PC: tg20official

TG20 League 2026: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘టీజీ20 లీగ్ 2026’ టోర్నీలో సరికొత్త రికార్డు నమోదైంది. టోర్నమెంట్‌లో మొట్టమొదటి సెంచరీ నమోదై ప్రేక్షకులను అలరించింది. మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ ఓపెనర్, కెప్టెన్ అమన్ రావు పేరాల సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ మైదానంలో విధ్వంసం సృష్టించాడు. కేవలం 32 బంతుల్లోనే అమన్ శతకాన్ని బాదాడు. తద్వారా ఈ సరికొత్త లీగ్ టోర్నీలో సెంచరీ సాధించిన మొట్టమొదటి బ్యాటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కాడు.

సిక్సర్ల సునామీ.. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!

మ్యాచ్ ఆరంభం నుంచే అమన్ రావు భారీ షాట్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లలోనే రెండు సిక్సర్లు బాదిన అమన్, ఆ తర్వాత కూడా తన జోరును ఏమాత్రం తగ్గించలేదు. ముఖ్యంగా సయ్యద్ ఖాజీ అబ్బాస్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో అమన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4, 6, 6 బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలోనే కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

బౌలర్లకు చుక్కలు

అర్ధ సెంచరీ తర్వాత కూడా మెదక్ ఫాల్కన్స్ బౌలర్లను అమన్ రావు ఓ ఆట ఆడుకున్నాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ వేసిన ఏడో ఓవర్లో చివరి మూడు బంతులకు వరుసగా 6, 4, 4 బాదాడు. అనంతరం రవితేజ వేసిన ఎనిమిదో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. చివరకు సాయి వరుణ్ బౌలింగ్‌లో (9.4 ఓవర్ వద్ద) ఫోర్ బాదడం ద్వారా అమన్ రావు తన అద్భుతమైన సెంచరీ మార్కును అందుకున్నాడు. అమన్ రావు ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ టీజీ20 లీగ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed