ఈ క్రమంలోనే తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారానికి, వ్యక్తిత్వ హననానికి అడ్డుకట్ట వేయాలంటూ విష్ణుప్రియ రీసెంట్ గా హైదరాబాద్ పోలీసులను (Cyber Crime Police) ఆశ్రయించింది. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా అసభ్యకరమైన థంబ్ నెయిల్స్, కంటెంట్‌ను వైరల్ చేస్తున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, యూట్యూబ్ ఛానళ్లపై ఆమె లిఖితపూర్వకంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.













