Today Top 10 News: ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్ | తెలంగాణ వార్తలు | ACTPnews

Today Top 10 News: ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్ | తెలంగాణ వార్తలు


తెలంగాణలో కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కార్మికులను 4 విభాగాలుగా విభజించిన ప్రభుత్వం.. అన్‌స్కిల్డ్‌ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.16 వేలకు పెంచింది. సెమీ స్కిల్డ్‌ కార్మికులకు రూ.13 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. స్కిల్డ్‌ కార్మికులకు రూ.17 వేల నుంచి రూ.18 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న:

తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్‌ కల్చర్‌, ఎవరివి హత్యా రాజకీయాలు అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్‌ చేశారు. తన తాత వైఎస్ రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా అని ప్రశ్నించారు.

పుల్వమా ఉగ్రదాడి సూత్రధారి హతం

పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్ హతమయ్యాడు .పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చిచంపారు. పుల్వామాకు చెందిన బుర్హాన్‌ ఉన్నత విద్యను అభ్యసించే నెపంతో 2017లో పాకిస్థాన్‌కు వెళ్లాడు. తర్వాత నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బదర్‌లో చేరి, కొద్ది కాలంలోనే కమాండర్ స్థాయికి ఎదిగాడు. అతడిని 2022లో భారత్‌ అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్ హతమయ్యాడు (Pulwama attack mastermind). పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చిచంపారు.

కాక్రోచ్ పార్టీ ఎక్స్ నిలిపివేత

సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్‌ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. అనధికారిక పొలిటికల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ ‘ఎక్స్‌’ ఖాతాను నిలిపివేశారని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే తెలిపారు. ఎక్స్‌ ఖాతా నిలిపివేసే సమయానికి ఆ ఖాతాకు దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు, కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే సీజేపీకి చెందిన ఇన్‌స్టా ఖాతాను 14 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతుండటం గమనార్హం. సీజేపీ పేరిట వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు.

ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు:

పలు దేశాల్లో ఎబోలా కేసులు కలకలం రేపుతున్న వేళ దిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే ఎయిర్‌పోర్టు వైద్యసిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణం చేసిన 21 రోజుల్లోగా ఈ లక్షణాలు కనిపించినా స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని సూచించారు.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు:

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌పై ఒత్తిడి కారణంగా సూచీలు ప్రభావితమయ్యాయి. ఉదయం లాభాల్లో ట్రేడయిన సూచీలు.. చివరికి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 135.03 పాయింట్లు నష్టపోయి 75,183.36 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ 4.30 పాయింట్ల నష్టంతో 23,654.70 వద్ద స్థిరపడింది. ఆర్‌బీఐ రంగ ప్రవేశంతో డాలరుతో రూపాయి విలువ 63 పైసలు బలపడి 96.23కు చేరుకుంది.

తిరుమలకు రావొద్దు.. !

వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1, 2లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా నిండాయి. దీంతో బాట గంగమ్మ ఆలయం క్యూలైన్‌ వరకు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటలకుపైగా సమయం పడుతుండటంతో శుక్రవారం ఉదయం 6 గంటల తర్వాత క్యూలైన్‌లోకి రావాలని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. దీంతో భక్తులు వెనుదిరిగి పీఏసీ సముదాయాలకు చేరుకుంటున్నారు.

తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభం:

సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా ఆరంభమయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి తొలిసారి అంత్య పుష్కరాలు నిర్వహిస్తోంది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అసౌకర్యం కలగకుండా భారీ టెంట్లు, కూలర్లు సైతం ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని అధికారులు చెబుతున్నారు.

ఏపీ తెలంగాణలో నిప్పుల కుంపటి:

ఎండల తీవ్రతతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లలో 48.1, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజల అవసరం అయితే తప్ప బయటకు రావద్దు అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక వడగాలులకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్:

ఎన్టీఆర్ బర్త్ డే ఈ సినిమా నుంచి మొదటి అప్‌డేట్‌గా గ్లింప్స్‌ను విడుదల చేశారు. 4 నిమిషాలు ఉన్న ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. 24 గంటల్లో ‘డ్రాగన్‌’ గ్లింప్స్‌ 64 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్నట్లు టీమ్‌ తెలిపింది. ఇప్పటివరకూ ఇండియాలో ఏ సినిమా గ్లింప్స్‌నకు ఇన్ని వ్యూస్‌ రాలేదని వెల్లడించింది. ఇది ఆల్‌టైం రికార్డు అంటూ పోస్టర్‌ విడుదల చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *