GT vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఐపీఎల్ 2026లో అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ కీలక పోరు, ప్లే ఆఫ్స్ కోసం సీఎస్‌కేకు భారీ తేడాతో గెలుపు తప్పనిసరి, నెట్ రన్‌రేట్ కీలకం

News18
News18

అహ్మదాబాద్ మైదానం మరో హై వోల్టేజ్ పోరుకు రెడీ అయింది. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ ప్లే ఆఫ్స్ రేస్‌ను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎలాంటి సందేహం లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది. అహ్మదాబాద్ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉండటంతో చెన్నై ప్లాన్ స్పష్టంగా కనిపిస్తోంది.. లక్ష్యాన్ని ఛేజ్ చేస్తూ నెట్ రన్‌రేట్ మిషన్ పూర్తి చేయాలని సీఎస్‌కే భావిస్తోంది.

ఈ మ్యాచ్ చెన్నైకి సాధారణ పోరు కాదు.. అసలు సిసలైన “చావో రేవో” సమరం. ప్లే ఆఫ్స్ ఆశలు బతికుండాలంటే గుజరాత్‌ను తప్పనిసరిగా ఓడించాలి. అది కూడా కేవలం గెలుపు సరిపోదు. సీఎస్‌కే ఛేజింగ్ చేస్తే 17 ఓవర్లలో టార్గెట్ పూర్తి చేయాలి. ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 25 పరుగుల భారీ తేడాతో గెలవాలి. అంటే ఈ మ్యాచ్‌లో ప్రతి ఓవర్, ప్రతి బౌండరీ, ప్రతి వికెట్ నెట్ రన్‌రేట్ సమీకరణాల్లో కీలకం కానుంది.

ఈ కీలక పోరులో చెన్నై ఒక వ్యూహాత్మక మార్పు చేసింది. స్టార్ స్పిన్నర్ హొస్సేన్‌ను పక్కనపెట్టి యువ పేసర్ గుర్జప్నీత్ సింగ్‌కు అవకాశం ఇచ్చింది. అహ్మదాబాద్ పిచ్‌పై పేస్ బౌలింగ్ ప్రభావం చూపుతుందనే అంచనాతో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక బ్రెవిస్, శివమ్ దూబె, మాథ్యూ షార్ట్ వంటి హిట్టర్లు ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాల్సిన అవసరం ఉంది.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు జోస్ బట్లర్, సాయి సుదర్శన్ వంటి స్టార్ బ్యాటర్లు ఫామ్‌లో ఉండటం జీటీకి పెద్ద బలం. బౌలింగ్‌లో రషీద్ ఖాన్, రబాడా, సిరాజ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉండటంతో సీఎస్‌కేకు ఇది అంత ఈజీ ఫైట్ కాదు. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే మ్యాచ్ మోమెంటమ్ మారే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పుడు అందరి చూపు ఒక్కటే.. ప్లే ఆఫ్స్ కోసం సీఎస్‌కే అసాధారణ ఛేజ్ చేస్తుందా? లేక గుజరాత్ టైటాన్స్ తమ హోం గ్రౌండ్‌లో చెన్నై ఆశలకు బ్రేక్ వేస్తుందా? అహ్మదాబాద్‌లో ఈ రాత్రి జరగబోయేది కేవలం మ్యాచ్ కాదు.. ఐపీఎల్ 2026లో మరో థ్రిల్లింగ్ క్రికెట్ యుద్ధం.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *