Iran News: హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. ఇరాన్ డ్రోన్, క్షిపణి స్థావరాలపై అమెరికా భీకర వైమానిక దాడులు! | | ACTPnews

హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్ (Image credit - reuters)


Last Updated:

Iran News: మొన్ననే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. అంతా బాగుందని అనుకునేలోపు.. మళ్లీ యుద్ధం మొదలైంది. దీనికి ఇరానే కారణం అని అమెరికా అంటోంది. కానీ.. ఈ దాడులు చూస్తుంటే.. ఇక ఇరాన్ కూడా గట్టిగా రియాక్షన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్ (Image credit - reuters)
హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్ (Image credit – reuters)

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య మార్గమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. జూన్ 25న ఒమన్ తీరానికి దగ్గర్లో ప్రయాణిస్తున్న సింగపూర్ జెండా ఉన్న కార్గో నౌక ‘ఎమ్.వి. ఎవర్ లవ్లీ’ (M/V Ever Lovely)పై ఇరాన్ సైన్యం ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ చర్యను ‘మూర్ఖపు ఉల్లంఘన’గా అభివర్ణించారని ది గార్డియన్ రిపోర్ట్ చేసింది.

ఇరాన్ దాడికి ప్రతీకారంగా జూన్ 26న అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వైమానిక దళాలు చేసింది. ఇరాన్‌లోని కీలక డ్రోన్, క్షిపణి నిల్వ కేంద్రా, కోస్టల్ రాడార్ సైట్‌లపై భీకరమైన దాడులు జరిపి ధ్వంసం చేసిందని అల్ జజీరా రిపోర్ట్ చేసింది. ఇటీవల రెండు దేశాల మధ్యా అవగాహన ఒప్పందం (MOU) కుదిరిన తర్వాత మళ్లీ ఈ స్థాయిలో దాడులు జరగడంతో.. ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఇక ఈ యుద్ధం ముగియడం కష్టమే అనే ఆలోచనకు వస్తున్నాయి.

* అమెరికా హెచ్చరిక: “శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించింది, హింసకు హింసతోనే సమాధానం ఉంటుంది” అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

* ఇరాన్ స్పందన: దక్షిణ ఇరాన్ రేవు పట్టణమైన సిరిక్ (Sirik) సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు ఇరాన్ అధికారిక టెలివిజన్ ధృవీకరించింది. జలసంధిలో తమ అనుమతి లేకుండా నౌకల రాకపోకలను సహించేది లేదని ఇరాన్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఆ సింగపూర్ నౌక తమ ఆదేశాల్ని ఉల్లంఘించడం వల్ల దానిపై దాడి చేశామని ఇరాన్ తెలిపింది.

* వాణిజ్యం నిలిపివేత: ఈ ఘర్షణల కారణంగా ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (IMO).. పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకున్న వందల నౌకల తరలింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిందని సీబీఎస్ న్యూస్ తెలిపింది.

తెలుగు రాష్ట్రాలపై ప్రభావం:

హార్ముజ్ జలసంధి గుండా అంతర్జాతీయ చమురు సరఫరా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. దీనివల్ల హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై భారం పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, గల్ఫ్ దేశాల్లో, మర్చంట్ నేవీలో పనిచేస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేల మంది నావికులు, ప్రవాసాంధ్రుల భద్రతపై వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి: Pakistan Village: పాకిస్థాన్‌లో నిజాయితీ గల గ్రామం. వందేళ్లలో ఒక్క కేసూ లేదు.. నిజం బాసూ!

అమెరికా ఇప్పుడు చేసిన దాడులన్నీ.. ఇరాన్‌కి అత్యంత కీలకమైన ప్రదేశాల్లో చేసినవే. అక్కడి నుంచి ఇరాన్.. హార్ము్జ్ జలసంధిలో వెళ్లే నౌకల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వాటిని బెదిరిస్తూ, అవసరమైతే దాడులు చేస్తుంది. అలాంటి చోట అమెరికా దాడులు చెయ్యడం వల్ల ఇరాన్ కచ్చితంగా, తీవ్రంగా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. దీని వల్ల రెండు దేశాల మధ్యా.. జరుగుతున్న శాంతి చర్చల ప్రక్రియకు ఆంటంకం కలగవచ్చు. ఇది ప్రపంచ దేశాలకు ఏమాత్రం అనుకూల అంశం కాదు.

తాజా దాడుల వల్ల భారత్‌కి మళ్లీ చమురు, గ్యాస్ సప్లై కొరత రావచ్చు. హార్ముజ్ జలసంధి నుంచి ఇప్పుడు నౌకలు వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఇండియాకి రావాల్సిన చమురు, గ్యాస్ సప్లై బాగా తగ్గే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల దేశీయంగా ప్రజలకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత రావచ్చు. అందువల్ల ప్రజలు వీటి వాడకాన్ని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. వృథా అవ్వకుండా చూసుకోవాలి. అలాగే గ్యాస్ బండలో గ్యాస్ అయిపోతే, వెంటనే రీ-ఫిల్ బుక్ చేసుకోవాలి. ఆలస్యమైతే.. ఇబ్బందులు రావచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports