Today Top 10 News: శిథిలాల కింద 50 వేల మంది.. నటుడు భాగ్యరాజ్ మృతి.. నేటి టాప్ 10 న్యూస్ మీకోసం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు


మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్టు బాధిత రైతులకు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం చిరస్మరణీయమన్నారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను రైతులు త్యాగం చేశారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల భవిష్యత్తును మార్చబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు.

——————————-

2.నేను కుల రాజకీయాలు చేయను

మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కీలక సమావేశంలో పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీతో పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను కుల రాజకీయాలు చేయనన్నారు. తనని తిట్టిన వాళ్లంతా కాపులే అన్నారు. జనసేన పార్టీకి రాజకీయ విజయం కాకుండా సామాజిక విజయం దక్కాలన్నారు. కుల రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు.

———–

3.రహస్య భేటీ వివరాలు బయటపెట్టండి

బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కర్ణాటకలో జరిగిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశ వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకతో జరిగిన ఒప్పందాలను శాసనసభలో ప్రవేశపెట్టి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా నిర్ణయాలు తీసుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తుంగభద్ర ప్రాజెక్టు అంశంలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.

———

4.అతి చేస్తే మిత్తితో సహా చెల్లిస్తాం

వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన సమావేశంలో కేటీఆర్ అధికారులకు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదని, మహిళలకు ఇచ్చిన హామీలు, ఉద్యోగాల హామీ నెరవేరలేదని విమర్శించారు. రైతుబంధు అమలులో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని కేటీఆర్ హెచ్చరించారు. అధికారం అండగా అతి చేస్తే మిత్తితో సహా చెల్లిస్తామని, పదవీ విరమణ తర్వాత కూడా చట్టం ముందు నిలబెడతామని అన్నారు. పార్టీ కార్యకర్తల భవిష్యత్తు, గౌరవం, పదవుల విషయంలో తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు.

————-

5.నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ

నెల్లూరు బారా షహీద్ దర్గాలు రొట్టెల పండగ ఘనంగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు.

బారాషాహీద్ దర్గాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రి గంధ మహోత్సవం కూడా ఘనంగా జరగనుంది.

——–

6.వెదర్ అప్ డేట్స్

తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వచ్చే 7 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఇవాల్టి నుంచి జూలై 2 వరకు భారీ వర్ష సూచన ఉందన్నారు.

——–

7.భాగ్యరాజ్‌కు సినీ ప్రముఖుల నివాళి

ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ (74) మరణించారు . గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇండియన్‌ సినిమాలో భాగ్యరాజ్‌కు ‘కింగ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ ప్లే’ అనే పేరు ఉంది. తెలుగులో ‘పెళ్లైంది కానీ..’. . ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’.. అబ్బాయిగారు మూవీలకు స్క్రిప్ట్ అందించారు. భాగ్యరాజు మృతితో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నిండింది. సినీ ప్రముఖులంతా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

———-

8.రజనీకాంత్‌ వివరణ ఇవ్వడం.. చాలా బాధగా ఉంది

నటుడు విష్ణు విశాల్ సోషల్ మీడియాలో రజనీకాంత్‌పై వస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు,సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై మండిపడ్డారు. విజయ్‌పై అసూయ ఉందని చెప్పడం బాధాకరమని, రజనీకాంత్ స్వయంగా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. సినీ పరిశ్రమలో వృత్తిపరమైన గౌరవాన్ని వ్యక్తిగత విభేదాలుగా చూపించవద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ఊహాగానాలను నమ్మొద్దని సూచించారు.

——

9.సెషల్స్‌లో ప్రధాని పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా సీషెల్స్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా గుర్తింపు పొందిన 193 ఏళ్ల తాబేలు జొనాథన్‌ను సందర్శించనున్నారు. అనంతరం సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్‌లో మొక్క నాటనున్నారు. భారత్–సీషెల్స్ దౌత్య సంబంధాల 50 ఏళ్ల సందర్భంగా నిర్వహించే జాతీయ దినోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

——-

10.శిథిలాల కింద 50,000 మంది

వెనిజులాలో సంభవించిన జంట భూకంపాల తర్వాత పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. మృతుల సంఖ్య పెరుగుతుండగా, వేలాది మంది గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా 50 వేల మంది చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports