Last Updated:
Bengaluru Daycare Horror: పిల్లలు నర్సరీల్లో చక్కగా ఆడుకుంటారనీ, చాలా విషయాలు నేర్చుకుంటారని తల్లిదండ్రులు భావిస్తారు. మూడేళ్లు రాగానే నర్సరీల్లో చేర్పిస్తారు. కానీ.. బెంగళూరు నర్సరీల్లో జరుగుతున్న అరాచకం చూసి తల్లిదండ్రులు షాకయ్యారు. అసలు నర్సరీల్లో ఏం జరుగుతోందో తెలుసా?
బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్‌జెమిని (Capgemini) హాల్ క్యాంపస్‌లోని డేకేర్ సెంటర్లో జరిగిన దారుణ ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. 2 నుంచి 3 సంవత్సరాల వయస్సు గల చిన్నారులను వాషింగ్ మెషిన్ డ్రమ్‌లో బంధించి, డార్క్ బాత్రూమ్లలో లాక్ చేసి, టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు చల్లి వేధించినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు ఐదుగురు మహిళా కేర్ టేకర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
న్యూస్18 రిపోర్టు ప్రకారం, ఐటీ ఉద్యోగులు తమ ఉద్యగ సమయంలో పిల్లల్ని ఈ డేకేర్ సెంటర్లో వదిలి వెళ్తున్నారు. ఇక్కడ పని చేసే మంజుల, విజయలక్ష్మి, సింధు, భవాని, బిందు అనే ఐదుగురు సిబ్బంది.. పిల్లలను సైలెంటుగా ఉంచడానికి ఈ పైశాచిక పద్ధతులు పాటిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పిల్లలు ఏడ్చినప్పుడు ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్లో ఉంచి తలుపు మూసేసి భయపెట్టేవారు. అలాగే వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్‌పై కూర్చోబెట్టి, హై ప్రెజర్ జెట్‌తో నోట్లో నీళ్లు చల్లి, చీకటి బాత్రూమ్లలో లాక్ చేసేవారని వీడియోలు చూపిస్తున్నాయి.
🚨 Bengaluru Daycare Horror: Five women booked after toddlers were allegedly forced into a washing machine and abused at a daycare. The accused have been taken in for questioning. Investigation is underway.#Bengaluru pic.twitter.com/wQrCdaNl4i
— Smriti Sharmaa (@SmritiSharma_) July 1, 2026
పోలీసు అధికారులు, చైల్డ్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం, ఈ వేధింపులు.. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ కింద కేసు నమోదైంది. ప్రస్తుతం నిందితులను విచారించడం, వీడియోల సాక్ష్యాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం ల్యాబ్‌కి పంపడం జరుగుతోంది. ఈ ఘటన ఎంతకాలం నుంచి జరుగుతోంది? ఎంత మంది పిల్లల్ని వేధించారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్‌కు కూడా ఫిర్యాదు అందింది.
ఈ సంఘటన భారతదేశంలోని ఐటీ హబ్‌లలోని కార్పొరేట్ డేకేర్ సెంటర్ల నియంత్రణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. పని చేసే తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మకంగా వదిలి వెళ్తారు కానీ సరైన సర్వైలెన్స్ లేకపోవడం, సిబ్బంది సైకలాజికల్ స్క్రీనింగ్ లోపాలు ఇలాంటి దురంతాలకు దారితీస్తున్నాయని వర్కింగ్ పేరెంట్స్ అసోసియేషన్లు విమర్శిస్తున్నాయి. చైల్డ్ రైట్స్ యాక్టివిస్టులు తల్లిదండ్రులకు రియల్-టైమ్ సీసీటీవీ యాక్సెస్, ఆకస్మిక ఇన్స్పెక్షన్లు తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు థర్డ్ పార్టీ డేకేర్లకు బాధ్యత తప్పించుకోలేవని చట్టం చెబుతోంది.
Absolute Horror ! Toddlers who were left at a daycare facility in Bengaluru’s Capgemini Technology Services office were allegedly subjected to physical abuse, punished by locking them in bathrooms, faucets sprayed on thier faces and much more. FIR registered, investigation on. pic.twitter.com/CbnGcdcAUs
— Deepak Bopanna (@dpkBopanna) July 1, 2026
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ప్రజా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలల భద్రత, డేకేర్ రెగ్యులేషన్స్ మెరుగుపరచాలని డిమాండ్లు వస్తున్నాయి. పోలీసులు ఆరోపితులను కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా డేకేర్ సెంటర్లలో మరిన్ని దర్యాప్తులకు దారితీయవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల డేకేర్లను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని, సీసీటీవీలు, ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌లు ఉన్నవి మాత్రమే ఎంచుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
ఈ సంఘటన భారతీయ సమాజంలో పని చేసే తల్లిదండ్రుల సమస్యలను మరోసారి హైలైట్ చేసింది. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేయాలనీ, కార్పొరేట్ సామాజిక బాధ్యతను నిర్వర్తించాలని డిమాండ్లు బలపడుతున్నాయి. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుండగా, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













