Heavy Rains: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.. రైల్వే ట్రాక్‌లపై వరద నీరు, నిలిచిపోయిన పలు రైళ్ల సర్వీసులు | | ACTPnews

Mumbai Heavy Rains


Last Updated:

Mumbai Heavy Rains: భారీ వర్షాల కారణంగా ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే మూసివేయబడింది . ముంబై-గోవా హైవేపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. పట్టాల కింద ఉన్న కంకర కొట్టుకుపోవడంతో కర్జాత్-ఖోపోలి లోకల్ రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. వెస్ట్రన్ రైల్వే సేవలు 15–20 నిమిషాల ఆలస్యంతో నడుస్తున్నాయి.

Mumbai Heavy Rains
Mumbai Heavy Rains

Mumbai Heavy Rains: దేశ ఆర్ధిక రాజధాని ముంబై మహానగరంలో భారీ వర్షాల కారణంగా జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, కాలనీలు, రైల్వే ట్రాకులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేను మూసివేశారు. అలాగే పాత ముంబై-గోవా హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కర్జాత్ , ఖోపోలి మధ్య లోకల్ ట్రైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రైలు పట్టాలపై నీరు నిలవడంతో వసాయ్- విరార్ మధ్య రైలు రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.

రైలు పట్టాలపై వరదనీరు..

భారీ వర్షాల కారణంగా సెంట్రల్ , వెస్ట్రన్ రైల్వే నెట్‌వర్క్‌లలోని లోకల్ రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. కర్జాత్-ఖోపోలి మార్గంలో వర్షపు నీటి ప్రవాహ ఉధృతి ఎంత తీవ్రంగా ఉందంటే పట్టాల కింద ఉండే కంకర పొర (ballast) కొట్టుకుపోయింది. దీనివల్ల భద్రతా చర్యగా కర్జాత్ – ఖోపోలి మధ్య లోకల్ రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

యుద్ధ ప్రాతిపదికన పట్టాల మరమ్మతు పనులు..

పట్టాల కింద ఉన్న కంకర (బాలాస్ట్) కొట్టుకుపోయిందని తెలియగానే రైల్వే ఇంజనీర్లు ,నిర్వహణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడుతున్నారు. పనులు పూర్తయిన తర్వాతే సేవలు పునరుద్ధరించబడతాయని సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

.

పశ్చిమ రైల్వేపైనా నీటి నిల్వ ప్రభావం.. 15–20 నిమిషాల ఆలస్యంగా నడుస్తున్న లోకల్ రైళ్లు

పశ్చిమ రైల్వే ప్రయాణికులు కూడా ఈ రోజు జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. వసాయ్ రోడ్ , విరార్ స్టేషన్ల మధ్య పట్టాలపై నీరు నిలిచిపోవడంతో, సబర్బన్ రైలు సేవలు ప్రస్తుతం నిర్ణీత సమయం కంటే సుమారు 15 నుండి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైలు పట్టాలపై నీరు నిలవడం వల్ల స్థానిక రైళ్ల సర్వీసులు నెమ్మదించాయి. దీంతో పనికి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు బయలుదేరే ముందు తాజా రైల్వే అప్‌డేట్‌లను తనిఖీ చేసుకోవాలని, దానికి అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పరిపాలన యంత్రాంగం కోరింది.

లోకల్ ట్రైన్ సర్వీసులు బంద్..

హార్బర్ లైన్‌లో రైలు సేవలు 10 నుండి 15 నిమిషాల ఆలస్యంతో నడుస్తున్నాయి. సెంట్రల్ రైల్వే లైన్‌లో ‘స్లో’ (slow) రైళ్లు 10 నుండి 15 నిమిషాలు ఆలస్యం కాగా, ‘ఫాస్ట్’ (fast) రైళ్లు నిర్ణీత సమయం కంటే 15 నుండి 20 నిమిషాలు వెనుకబడి నడుస్తున్నాయి. భారీ వర్షాలు మరియు బలమైన గాలుల వల్ల గణనీయమైన నష్టం వాటిల్లింది, అలాగే పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. లోకల్ రైలు సేవలు కూడా నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports