ప్యాకేజ్ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కో వ్యక్తికి రూ.41,000, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కో వ్యక్తికి రూ.44,000, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.60,700 చెల్లించాలి. ప్యాకేజ్‌లో ఉండే సౌకర్యాలు చూస్తే హైదరాబాద్ నుంచి కొచ్చికి, తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు రిటర్న్ ఫ్లైట్ టికెట్లు ఉంటాయి. కొచ్చిలో రెండు రాత్రులు, మున్నార్‌లో రెండు రాత్రులు, కుమారకంలో ఒక రాత్రి సంప్రదాయ హౌస్‌బోట్‌లో, తిరువనంతపురంలో ఒక రాత్రి వసతి ఉంటుంది. ఆరు అల్పాహారాలు, ఆరు రాత్రి భోజనాలు, రెండు మధ్యాహ్న భోజనాలు అందిస్తారు. సందర్శన కార్యక్రమాలు, ట్రాన్స్ఫర్ల కోసం ఎయిర్ కండీషన్డ్ వాహనం ఏర్పాటు చేస్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్, ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు, వర్తించే అన్ని పన్నులు కూడా ప్యాకేజ్‌లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)













