అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఇల్లు నిర్మాణం 2009 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ప్రస్తుతం నలుగురు సోదరుల కుటుంబాలు ఇక్కడ నివసిస్తుండగా, ఒక సోదరుడు మాత్రం గ్రామంలోని ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఇంటి నిర్మాణం, అక్కడ ఉండే వారి గురించి నన్హే ప్రధాన్ ఏమంటున్నారంటే తాము ఐదుగురు సోదరులమని మా అందరికీ కలిపి మొత్తం 21 మంది పిల్లలు అంటే 16 మంది కుమారులు, 5 మంది కుమార్తెలు ఉన్నారు. మేమంతా కష్టపడి, నిజాయితీగా సంపాదించిన డబ్బుతోనే ఈ ఇంటి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అంతే కాదు తామంతా కలిసే ఇదే ఇంట్లో నివసిస్తున్నామని చెప్పారు.













