Last Updated:
అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటి లెనిన్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాలేజీ కుర్రాళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.
అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటి లెనిన్. నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్ హీరోగా రాబోతున్న ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి మురళీ కిషోర్ దర్శకత్వం వహించగా ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జులై 10 న విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలో జోరుగా చిత్ర ప్రమోషన్స్ చేపడుతున్నారు మేకర్స్. చిత్ర యూనిట్ అంతా కలిసి లెనిన్ సినిమాకు బూస్ట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఓ కాలేజీకి వెళ్లి లెనిన్ ప్రమోషన్స్ చేపట్టిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, అక్కడి కాలేజీ కుర్రాళ్లకు సూపర్ ఆఫర్ ఇచ్చింది. వేదికపై ఆమె మాట్లాడుతూ క్లాసులు బంక్ కొట్టి ‘లెనిన్’ సినిమాకి వెళ్తారా? ఎంత మంది గర్ల్‌ఫ్రెండ్స్‌తో వెళ్తున్నారు? నాతో ఎంతమంది వస్తారు? అంటూ కుర్రాళ్లలో ఊపు తెప్పించింది.
ఇప్పటికే విడుదలైన లెనిన్ సాంగ్స్, టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ‘ఏజెంట్’ తర్వాత వస్తున్న అఖిల్ సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పైగా ఈ సినిమా విజయంపై నాగార్జున ఎంతో పాజిటివ్ గా ఉండటంతో.. ఈ సారి అఖిల్ ఖాతాలో హిట్ పక్కా అంటూ అక్కినేని అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.
లెనిన్ అవుట్ పుట్ చూసిన నాగార్జున.. అఖిల్ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తాడని వెల్లడించారు. లెనిన్ సినిమా చూశాను. చాలా గర్వంగా అనిపించింది. అఖిల్ ఒక సరికొత్త అవతారంలో మిమ్మల్ని అలరించబోతున్నాడు అని నాగ్ ధీమా వ్యక్తం చేశారు. నాగార్జున మాటలు చూస్తుంటే ఈసారి అఖిల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 08, 2026 11:38 AM IST













