“అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. కొద్ది గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో మునిగిపోయిన పడవలో కింది పేర్కొన్న 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. జరిగిన ప్రాణనష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేము సేకరిస్తున్నాము. త్వరలోనే అప్డేట్ చేస్తాము,” అని ఎంబసీ పేర్కొంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతి చెందారు. ఇందులో తెలుగు వాళ్లు ఇద్దరు ఉన్నట్లు సమాచారం.
1. బాలసుబ్రమణి పళనిసామి
2. సెల్వం పిచ్చయ్య
3. సెంథిల్ కుమార్ జయవేల్
4. శివకుమార్ ముత్తుకుమారసామి
5. నిర్మల్ కుమార్ సేతురామన్
6. మురుగ ప్రభు ఆరుముగం
7. రూబన్ సెల్వ నాథన్ జాకబ్ యేసుపథం
8. శ్రీధర్ ధర్మరాజన్
9. విఘ్నేశ్వర్ రాధాకృష్ణన్ గోపాల్
10. రామసుబ్బు అన్నావి
11. అబుతల్హా జహీనుద్దీన్
12. శ్రీధర్ సుందరరాజన్
13. వంశీధర్ చెల్లూరు రామ్రాజ్
14. సెంజాదైవేల్ కుప్పుసామి
15. నగలమడుగు సోహన్
16. నల్లపేట ఆదిశేషయ్య రవితేజ (తెలుగు)
17. షేక్ అబ్దుల్లా అబ్దుల్ మజీద్ (తెలుగు)
18. రాజీవ్ కలైవానన్
19. బాలాజీ నటేషన్
20. వినయ్ కుమార్ చిత్తిపరము భాస్కర
21. రవిశంకర్ సుగుమారన్
22. విపుల్ ఉత్తమ్ చంద్
23. సంతోష్ కుమార్ శాంతిలాల్ జైన్
24. బాబు కుప్పుస్వామి
25. అలగురాజన్ శివసామి
26. వసంత కుమార్ ఆనందన్
27. శ్రీధర్ ముడియం (తెలుగు)
28. జయ లక్ష్మి గెల్లి (తెలుగు)
29. కిషోర్ గెల్లి (తెలుగు)
30. అవికోట్ చెరియన్ థామస్ థామస్
31. లోవేని థామస్
32. రమేష్ కుమార్ పచ్చియప్పన్
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. లావా హ్యాండ్సెట్ కంపెనీ తమ బిజినెస్ పార్టనర్ల కోసం ఏర్పాటు చేసిన ఇన్సెంటివ్ (ప్రోత్సాహక) ట్రిప్‌లో భాగంగా వీరంతా వియత్నాం వెళ్లారు. భారతదేశం నుండి మొత్తం 100 మందికి పైగా లావా ఛానల్ పార్టనర్లు, కంపెనీ ప్రతినిధులు ఈ ఆఫ్‌సైట్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు తమ కుటుంబ సభ్యులను కూడా ఈ పర్యటనకు తీసుకువచ్చారు.
ఈ ఘోర ప్రమాదంపై లావా కంపెనీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. “వియత్నాంలో మా ఛానల్ పార్టనర్లు, టీమ్ సభ్యులకు ఎదురైన ఈ ఘోర ప్రమాద వార్త మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఈ హృదయవిదారక ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ మా ఆలోచనలు, ప్రార్థనలు తోడుగా ఉంటాయి,” అని కంపెనీ పేర్కొంది.













