Last Updated:
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, కావ్య మారన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ఆమె పెళ్లి అనే విషయం నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, కావ్య మారన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల సమయంలో ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. అయితే ఈసారి క్రికెట్ కంటే ఆమె వ్యక్తిగత జీవితంపై వచ్చిన గాసిప్స్ ఎక్కువ చర్చకు దారితీశాయి.
తాజాగా కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ తో కావ్య మారన్ వివాహం జరగబోతుందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. కొన్ని ఫ్యాన్ పేజీలు, అన్‌వెరిఫైడ్ సోషల్ మీడియా అకౌంట్లు వీరిద్దరూ చాలా కాలంగా రిలేషన్లో ఉన్నారని, త్వరలో పెళ్లి తేదీ ప్రకటించబోతున్నారని పోస్టులు పెట్టడంతో ఈ రూమర్స్ వేగంగా వైరల్ అయ్యాయి.
ఈ ప్రచారానికి ప్రధాన కారణంగా అనిరుధ్, సన్ గ్రూప్ మధ్య ఉన్న ప్రొఫెషనల్ అనుబంధాన్ని చూపిస్తున్నారు. అనిరుధ్ ఇప్పటికే సన్ గ్రూప్‌కు చెందిన సన్ పిక్చర్స్ నిర్మించిన భారీ చిత్రాలకు సంగీతం అందించారు. ‘జైలర్’, ‘బీస్ట్’, ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఆయనకు తమిళ సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఈ క్రమంలో సన్ నెట్వర్క్ కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలను కొందరు వ్యక్తిగత బంధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
ఇక ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారంటూ కూడా పలు ఊహాగానాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. కావ్య మారన్ గానీ, అనిరుధ్ గానీ తమ రిలేషన్షిప్ గురించి ఎక్కడా ప్రకటించలేదు. ఇరువురి కుటుంబాల నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం కావ్య మారన్ పూర్తిగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పైనే దృష్టి పెట్టగా, అనిరుధ్ తన వరుస సంగీత ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పెళ్లి వార్తలు ప్రస్తుతానికి కేవలం పుకార్లుగానే చెప్పుకోవచ్చు.
ఇక కావ్య మారన్ ఆస్తుల విషయానికొస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు యజమాని, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్ నికర వ్యక్తిగత ఆస్తుల విలువ సుమారు రూ. 400 నుంచి రూ. 417 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆమె తన తండ్రికి చెందిన సుమారు రూ. 33,000 కోట్ల (USD 4 బిలియన్లు) వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు కావ్య.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













