లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ముందు రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర తీవ్ర ఒత్తిడికి గురయ్యాడట. గెలుస్తామా? లేదా అన్నట్లు రాజస్థాన్ రాయల్స్ తీవ్ర నిరాశలోకి వెళ్లినట్లు వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. లక్నోతో జరిగిన పోరులో అద్భుత విజయం సాధించిన తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. “లక్నో మ్యాచ్‌కు ముందు వరుస ఓటములతో మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఆ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి జట్టు మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నేను బ్యాటింగ్‌కు వెళ్లేందుకు ప్యాడ్లు కట్టుకుని సిద్ధమవుతున్న సమయంలో మా ప్రధాన కోచ్ కుమార్ సంగక్కరను చూశాను. ఆయన ముఖంలో తీవ్రమైన టెన్షన్, ఒత్తిడి కనిపించాయి. కానీ, నాలో మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. నేను బాగా ఆడి జట్టును గెలిపించగలనని నమ్మాను. వెంటనే కోచ్ దగ్గరకు వెళ్లి.. ‘సార్, మీరేం టెన్షన్ పడకండి, నేను జట్టును గెలిపిస్తాను. ఈ పిచ్‌పై ఇదేమీ అంత భారీ స్కోర్ కాదు’ అని భరోసా ఇచ్చాను” అని వైభవ్ పేర్కొన్నాడు. 15 ఏళ్ల చిన్న వయసులోనే అంతటి దిగ్గజ కోచ్‌కు ధైర్యం చెప్పే స్థాయి పరిణతి ప్రదర్శించడం పట్ల క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.













