Jana Nayakudu Movie: దుమ్మురేపిన ‘జన నాయకుడు’ సినిమా కలెక్షన్లు.. దళపతి రేంజ్ అంటే ఇది కదా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

దళపతి నటించిన లాస్ట్ మూవీ ‘జననాయగన్’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తోంది. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.

News18
News18

దళపతి నటించిన లాస్ట్ మూవీ ‘జననాయగన్’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తోంది. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా తమిళనాడులో తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపించింది. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా నమోదు కావడంతో తొలి రోజు వసూళ్లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Sacnilk వెల్లడించిన వివరాల ప్రకారం, రాత్రి 9 గంటల వరకు ఈ సినిమా భారతదేశంలో రూ.28.71 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇందులో అత్యధిక కలెక్షన్లు తమిళ్ వెర్షన్ నుంచే వచ్చాయి. విజయ్‌కు తమిళనాడులో ఉన్న అపారమైన క్రేజ్ మరోసారి ఈ వసూళ్లతో స్పష్టమైంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా విడుదలైనప్పటికీ, తెలుగు వెర్షన్‌కు ఇప్పటివరకు రూ.89 లక్షల నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హిందీ వెర్షన్ రూ.73 లక్షలు రాబట్టినట్లు సమాచారం. ఇతర భాషల్లో కూడా పరిమిత స్థాయిలో విడుదలైన ఈ చిత్రం, అన్ని వెర్షన్ల కలిపి రోజు ముగిసే సమయానికి మరింత మెరుగైన వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, రాత్రి చివరి షోలు పూర్తయ్యే సమయానికి భారత్‌లో తొలి రోజు రూ.50 కోట్ల నెట్ మార్క్‌ను ఈ సినిమా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో విదేశీ మార్కెట్లలో విజయ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఓవర్సీస్ కలెక్షన్లు కూడా భారీగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

అన్ని ప్రాంతాల వసూళ్లను కలిపి చూస్తే ‘జననాయగన్’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంచనాలు నిజమైతే, విజయ్ కెరీర్‌లో మరో భారీ ఓపెనింగ్‌గా ఈ సినిమా నిలిచే అవకాశముంది.

హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన తర్వాత విడుదలైన తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి వీకెండ్ కలెక్షన్లపైనే ఉంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు కుటుంబ ప్రేక్షకుల మద్దతు లభిస్తే, తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా మరింత భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

కథ విషయానికి వస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన విజ్జి అలియాస్ మమితా బైజును దళపతి వెట్రి కొండన్ అలియాస్ విజయ్ దళపతి ఎంతో ప్రేమగా పెంచుతాడు. ఆమెను ఆర్మీ అధికారిగా చూడాలని కలలు కంటాడు. కానీ విజ్జి భయాలతో పాటు మానసిక సమస్యల కారణంగా ఆ దిశగా వెళ్లడానికి ఆసక్తి చూపదు. ఇదే సమయంలో జాన్ హిమ్లర్ అలియాస్ బాబీ డియోల్ అనే ప్రమాదకర వ్యక్తి, రాజకీయ నాయకుడు రోజా రంగసామి అలియాస్ ప్రకాష్ రాజ్‌తో కలిసి దేశంలో మత ఘర్షణలు రేపి అల్లకల్లోలం సృష్టించే కుట్ర పన్నుతాడు. ఈ కుట్రను దళపతి ఎలా అడ్డుకున్నాడు? విజ్జిలోని భయాన్ని ఎలా పోగొట్టాడు? అన్నదే సినిమా ప్రధాన కథ.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *