Last Updated:
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ నటించిన ‘జన నాయగన్’ మూవీ ఈ రోజు (జూలై 23) విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పబ్లిక్ ఏమంటున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ నటించిన ‘జన నాయగన్’ మూవీ ఈ రోజు (జూలై 23) విడుదల కానుంది. కన్నడ భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్కే నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సరసన అందాల తార పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇది విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో జనలో భారీ క్యూరియాసిటీ నెలకొంది. పైగా సీఎం అయ్యాక వస్తున్న సినిమా కదా.. పబ్లిక్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్ర పోషించగా.. బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవన్ మీనన్, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
You’ve given audiences countless memorable moments over the years, @actorvijay sir, and I’m sure #Jananayagan will become another cherished milestone in your remarkable journey. 🤗
From Thalapathy to the Hon’ble Chief Minister of Tamil Nadu, you’ve truly lived up to the name… pic.twitter.com/aJbicrCftN— Anil Ravipudi (@AnilRavipudi) July 22, 2026
ఎన్నో ఏళ్లుగా లెక్కలేనన్నీ మెమొరీస్‌ను ఆడియెన్స్ కి ఇచ్చిన విజయ్ సార్.. మీ అపురూపమైన జర్నీలో జన నాయగన్ మరో మైల్ స్టోన్ అవుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు, డైరెక్టర్ వినోద్‌కు, మొత్తం చిత్ర యూనిట్ నా శుభాకాంక్షలు. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా విజయం సాధించాలని కోరుకుంటున్నా అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
ఈ చిత్రంలో విజయ్ (వెట్రి కొండన్) అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా.. ఆయనకు జోడీగా పూజా హెగ్డే (కాయల్) పాత్రలో నటించగా, మమితా బైజు విజయ్ పెంచి పెద్ద చేసిన విజయలక్ష్మి (విజ్జి) పాత్ర పోషించింది. విజ్జిని మాఫియా డాన్‌గా నటించిన (బాబీ డియోల్) నుంచి రక్షించేందుకు హీరో చేసే పోరాటమే సినిమా మెయిన్ స్టోరీ అని తెలిసింది. 183 నిమిషాలు (3 గంటల 3 నిమిషాలు) రన్ టైమ్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇప్పటికైతే జన నాయగం అనేది విజయ్ వన్ మ్యాన్ షో అనే టాక్ బయటకొచ్చింది. సినిమాలో ఆయన మాస్ స్టైల్, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ విజయ్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అన్నట్లుగా ట్వీట్స్ కనిపిస్తున్నాయి. జైలు ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో హైలైట్ అంశాలు అంటున్నారు. అనిరుధ్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో మోత మోగించారట.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














