Ishan Kishan: అలా ఎలా మిస్ చేశావ్ సామీ! చేతికి అందిన వికెట్‌ను వదిలేసి తల పట్టుకున్న కీపర్ | క్రీడా వార్తలు | ACTPnews

ఇషాన్ కిషన్


Last Updated:

Ishan Kishan: భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ శనివారం జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఒక సులువైన రన్ అవుట్ అవకాశాన్ని అనూహ్య రీతిలో చేజార్చాడు. వికెట్ల వైపు బంతిని విసరడానికి బదులు, దిశ లేకుండా ఎక్కడో విసిరివేసి బ్యాటర్‌ను అవుట్ చేసే సువర్ణవకాశాన్ని మిస్ చేశాడు.

ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్

ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఛేజింగ్ చేస్తున్న సమయంలో, రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్ ఐదో బంతికి ఈ కామెడీ సంఘటన చోటుచేసుకుంది. జింబాబ్వే బ్యాటర్ తాడివనాషే మరుమణి బంతిని డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు నెట్టి ఒక రన్ తీశాడు. అయితే రెండో రన్ కోసం నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న న్యూమన్ నియామ్‌హురి సగం క్రీజు దాటి స్ట్రైకర్ ఎండ్‌కి పరుగెత్తుకొచ్చాడు. మరుమణి రెండో రన్‌కు నిరాకరించడంతో, ఇద్దరు జింబాబ్వే బ్యాటర్లు ఒకే వైపు (బౌలర్ ఎండ్‌లోనే) నిలబడిపోయారు. ఆ సమయంలో స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్ల వద్ద ఏ ఒక్క బ్యాటర్ కూడా లేడు.

ఫీల్డర్ విసిరిన బంతిని అందుకున్న ఇషాన్ కిషన్‌కు తన కెరీర్‌లోనే అత్యంత సులువైన రన్ అవుట్ చేసే అవకాశం లభించింది. కానీ కిషన్ ఆ కందరగోళాన్ని సమయానికి గుర్తించలేకపోయాడు. బాల్ చేతిలో ఉండి కూడా వికెట్లను పడగొట్టకుండా లేదా బౌలర్ బిష్ణోయ్‌కు విసరకుండా, పిచ్ మధ్యలోకి అండర్ ఆర్మ్ త్రో విసిరాడు. తీరా ఇద్దరు బ్యాటర్లు ఒకే వైపు ఉన్నారని గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్యాటర్ సురక్షితంగా క్రీజులోకి చేరుకున్నాడు. ఈ మిస్‌తో షాక్ తిన్న ఇషాన్ కిషన్ తన తలపై చేయి వేసుకుని తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.

తిలక్, ఇషాన్ మెరుపులు.. సిరీస్ భారత్ వశం

ఈ రన్ అవుట్ మిస్ హాస్యాస్పదంగా నిలిచినప్పటికీ, మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ (81), తిలక్ వర్మ (60 నాటౌట్) బాదిన అద్భుత అర్ధశతకాలతో పాటు బౌలర్లు కట్టుదిట్టంగా రాణించడంతో రెండో టీ20లో భారత్ 90 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ మరొక మ్యాచ్ మిగిలివుండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది.

భారత్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు ఆరంభం నుంచే దెబ్బతీశారు. మొదటి తొమ్మిది ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే రేసు నుంచి తప్పుకుంది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేయగా, జింబాబ్వే కేవలం 129 పరుగులకే ఆలౌట్ అయింది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports