Last Updated:
సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఆలోచన. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం “ఆలోచన”. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను పద్మశ్రీ మురళి మోహన్ విడుదల చేశారు.
తాజాగా “ఆలోచన” టీజర్ ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. “ఆలోచన” టీజర్ చాలా బాగుంది. ఫ్రేమింగ్, మ్యూజిక్ , పెర్ఫార్మెన్స్, వారి కాన్సెప్ట్ చాలా బాగుంది, వాస్తవ సంఘటనలను తీసుకొని చేసిన ఈ సినిమా అద్భుతమైన నటుల కాంబినేషన్ తో స్నేహం పై ఒక మంచి కాన్సెప్ట్ తో “ఆలోచన” చేశారని మంచి సంకల్పం తో నిర్మాతలు ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన సినిమాను నిర్మించారు అని విజయేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. ఈ చిత్రానికి సాంకేతిక వర్గం కెమెరా టి. సురేంద్ర రెడ్డి, సంగీతం వియాన్ , పాటలు: ప్రతాప్ రాజులపల్లి, ఎడిటర్: ఆర్.ఎల్.వర్మ, ఆర్ట్: గిరీష్ దేవాంగ్, ఈ.పి: సీ.హెచ్.విజయ్ కుమార్ అందిస్తున్నారు.
మంచి కథా బలం ఉన్న “ఆలోచన” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, ఈ సినిమా విజయం సాధించి, చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్, ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














