Last Updated:
ప్రస్తుతం ఇండియాలో ఏ హీరో కూడా లేనంత బిజీగా డార్లింగ్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఏకంగా 3,4 పాన్ ఇండియా సినిమాలున్నాయి. మళ్లీ అవేమి ఆశా మాశీ సినిమాలు కాదు. అన్ని రూ.300 కోట్లపైనే బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు.
ప్రస్తుతం ఇండియాలో ఏ హీరో కూడా లేనంత బిజీగా డార్లింగ్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఏకంగా 3,4 పాన్ ఇండియా సినిమాలున్నాయి. మళ్లీ అవేమి ఆశా మాశీ సినిమాలు కాదు. అన్ని రూ.300 కోట్లపైనే బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు. అందులో ఫౌజీ మూవీ ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు గట్రా మాములు ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయలేవు. పైగా ఈ సినిమా పీరియాడిక్ కాన్సెప్ట్ అవడం, ఇందులో ప్రభాస్ సోల్జర్‌గా నటిస్తున్నాడని తెలియడంతో అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి.
ఇప్పటికే సీతారామం లాంటి కల్ట్ సినిమా తీసిన హను రాఘవపూడి ఈ సారి ప్రభాస్‌తో ఇంకా ఎలాంటి సినిమా చేస్తాడో అన్న ఊహే గూస్బంప్స్ తెప్పిస్తుంది. రీసెంట్గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ యావత్ ఇండియానే షేక్ చేసింది. ఇదే ఏడాది డిసెంబర్ 3న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుందని.. 1940 లైమ్ లైన్లో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ప్రేమ, త్యాగం, దేశభక్తిల మేళవింపుతో ఈ సినిమా ఉండబోతుందట. ప్రభాస్ ఈ సినిమాలో సైనికుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో ఇమాన్వి టాలీవుడ్‌లకు పరిచయం కాబోతుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమా టీజర్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగే. ఇప్పటి వరకు పోస్టర్లు చూస్తూ మురిసిపోయిన ఫ్యాన్స్‌కు ఇప్పుడు విజువల్ ట్రీటే. ఈ సినిమా స్వాతంత్య్ర పోరాట కాలం నేపథ్యంలో తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ఒక ధైర్యవంతమైన సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమైతే ప్రభాస్ కెరీర్లో మరో విభిన్నమైన పాత్రగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు డార్లింగ్ ప్రస్తుతం మరో మూడు సినిమాలను లైనప్‌లో పెట్టుకున్నాడు. అందులో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కుతున్న స్పిరిట్ ఒకటి. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ కంకణం కట్టుకుని కూర్చున్నారు. దీనితో పాటుగా నాగ్ అశ్విన్‌తో కల్కీ-2, ప్రశాంత్ నీల్‌తో సలార్-2 సినిమాలను లైనప్‌లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














