Last Updated:
Lok Sabha: యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కానీ ఆయన వ్యాఖ్యలపై అధికారపక్షం భగ్గుమంది. అన్‌పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది.
యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. “విద్యార్థులు చేసింది హింస కాదు, అది కోపం కాదు.. ఇది దేశ కొత్త జనరేషన్ ఆశ. ఢిల్లీ వీధుల్లో జరిగింది.. నిరసన కాదు.. భావ వ్యక్తీకరణ. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేశారు. కానీ కేంద్రం మూర్ఖంగా వ్యవహరించింది” అని విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.
పార్టీలన్నీ విద్యార్థుల ఆందోళనను గౌరవించాలి. యువ శక్తిని పార్టీలు గౌరవించాలి. విద్యార్థుల ఆందోళనను బీజేపీ నేతల పిల్లలు కూడా సమర్థించారు. విద్యార్థుల ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలోని వ్యక్తులు మా మాట వినరని ఓ యువతి నాతో అంది. “ఒక ఇడియట్.. తనను తాను దేవుడిలా చెప్పుకుంటారని ఓ విద్యార్థి చెప్పారు. స్టూడెంట్, ఇడియట్, అంధ భక్తుడు.. ఈ మూడు రకాల వారు ఉంటారనీ, అంధ భక్తుడు.. ఇడియట్‌ని ఫాలో అవుతారని ఆ విద్యార్థి చెప్పారు” అని రాహల్ గాంధీ అనడంతో.. సభలో బీజేపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాహుల్ ప్రసంగానికి అడ్డు తగిలారు. ఇడియట్ అనే పదం వాడటంతో వారు అభ్యంతరం చెప్పారు. ఇడియట్ అనే పదం అన్ పార్లమెంటరీ పదం అని బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యతరం చెప్పారు. దాంతో తాను ఆ పదం కాకుండా.. దాని బదులు మరో పదం వాడతానని రాహుల్ అన్నారు.
తాను మాట్లాడగానే.. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయని రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను అన్ పార్లమెంటరీగా భావించే పదాన్ని.. మరో ఎంపీని ఉద్దేశించి అనలేదు అని రాహుల్ అన్నారు. తనను మాట్లాడనివ్వకపోతే, తాను బయటకు వెళ్తానని రాహుల్ అన్నారు. తాను మాట్లాడుతుంటే.. ఎంపీ కిరణ్ రిజిజు లేచి నిలబడి అడ్డుకుంటారని రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
“సమాజంలో 3 కేటగిరీల వారు ఉంటారు. వారిలో ఒకరైన విద్యార్థులు నిజాన్ని కోరుకుంటారు. మిగతా కేటగిరీల వారు నిజం కోరుకోరు. వారు ఇమేజ్, హింసను కోరుకుంటారు. విద్యార్థులు ఎగ్జామ్స్, విద్యా వ్యవస్థపై నిరాశ చెందారు. ఎవరో సంపన్న విద్యార్థి.. లక్షలు ఇచ్చి.. ప్రశ్నాపత్రాన్ని కొట్టేశారు. కానీ పేద విద్యార్థి.. కష్టపడి చదివి, రాసి, నష్టపోయారు. మన విద్యావ్యవస్థ ఇలా ఉంది. అంతా ప్రైవేట్ అయిపోయింది. పేపర్ లీక్స్ కామన్ అయిపోయాయి. ప్రతీ పరీక్షలో ఏదో ఒకటి అవుతోంది. ప్రైవేట్ కంపెనీలు విద్యా వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నాయి. ఆరెస్సెస్.. ఈ విద్యా వ్యవస్థను తన కంట్రోల్‌లో పెట్టుకుంటోంది” అని రాహుల్ అన్నారు.
“ధర్మేంద్ర ప్రధాన్.. రాజీనామా చెయ్యడం కరెక్ట్. ఎందుకంటే.. ఆయన ఎప్పుడూ విద్యా శాఖను నిర్వహించలేదు. తెరవెనక ఆర్ఎస్ఎస్ నిర్వహించింది. ఆయన ఆ సీటులో కూర్చున్నారంతే. ఆర్ఎస్ఎస్ వాళ్లు విద్యార్థుల ఆశల్ని నెరవేరనివ్వట్లేదు. ప్రతీదీ కొనేలా చేస్తోంది ఈ ఆర్ఎస్ఎస్. ప్రతీ యూనివర్శిటీలో వీసీలు ఆర్ఎస్ఎస్ వారే. వారు విద్యార్థులను చదువుకోనివ్వట్లేదు. తమ కెరీర్‌ని నాశనం చేస్తున్న ఐడియాని విద్యార్థులు ప్రశ్నించారు” అని రాహుల్ అన్నారు.
“ఈ దేశ హోంశాఖ మంత్రికి ఇక్కడ కూర్చునే ధైర్యం లేదు” అని రాహుల్ గాంధీ అనడంతో.. బీజేపీ ఎంపీలు అభ్యంతరం చెప్పారు. హోంమంత్రి ఇవాళ ఎందుకు లోక్‌సభలో లేరు అని రాహుల్ ప్రశించారు. హోమంత్రి ఆదేశాలతోనే విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారని రాహుల్ ఆరోపించారు. దీనిపై కిరణ్ రిజిజు అభ్యంతరం తెలిపారు. బాధ్యతగా మాట్లాడాలనీ, అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. దీనికి రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చెయ్యకూడదు అన్నారు.
ఎవరిపైనైనా ఆరోపణ చెయ్యాలంటే.. ముందుగా నోటీస్ ఇవ్వాలనీ.. నియమాల ప్రకారమే నడచుకోవాలని స్పీకర్ సూచించారు. ఇలా ఆరోపణలు చెయ్యడం సరికాదన్నారు. ఆయన రాహుల్ గాంధీ మైక్‌ని కట్ చెయ్యడంతో దుమారం రేగింది.
ఇలా సభలో రచ్చ రచ్చ అవుతుండటంతో.. స్పీకర్ లోక్ సభను మధ్యాహ్నం 2.30 వరకూ వాయిదా వేశారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














