Top 10 News: ట్రెండింగ్ టాప్ 10 న్యూస్.. రాజకీయాలు, వినోదం, అంతర్జాతీయ వార్తలు ఒకేచోట | | ACTPnews

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు


పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత

వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నర్సంపేటలో జరుగుతున్న ఆయన అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ శోకసంద్రంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్ తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలముకుంది. పలువురు నివాళులర్పించారు.

నాంపల్లి కోర్టుకు కేటీఆర్‌..

ఫార్ములా ఈ-కార్ రేసు నిధుల దుర్వినియోగం అభియోగాల కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఆగస్టు 25కి వాయిదా వేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారనే ఆరోపణలపై ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌ ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. పలువురు నాయకులు వచ్చారు.

హైదరాబాద్‌లో కుండపోత వాన..

హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షాలతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్ సహా ప్రధాన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరిలోకి భారీగా వరద నీరు చేరడంతో భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రాంలోని ప్రాజెక్టులు సైతం నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. హైదరాబాద్ లోనూ గత మూడు రోజులుగా వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలను పోలీసులు కోరుతున్నారు.

మోదీజీ మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం

ఉత్తరాంధ్రలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. దేశ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయి అని మోదీ పోస్ట్ చేయగా, సీఎం చంద్రబాబు దానిని షేర్ చేశారు. ఉత్తరాంధ్ర టేకాఫ్‌కు సిద్ధంగా ఉందని, ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. విమానాశ్రయంతో ప్రాంతీయ ఉపాధి పెరుగుతుందని అన్నారు.

ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాగల కొన్ని రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

పీఎం కిసాన్‌ పథకం.. మరో ఐదేళ్లు

దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించే పీఎం-కిసాన్ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న ఐదేళ్ల కాలంలో ఈ పథకం కోసం రూ.3.15 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కీలక భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయోధ్య విరాళాల చోరీపై విపక్షాల వినూత్న నిరసన

అయోధ్య రామాఅయోధ్య విరాళాల చోరీపై విపక్షాల వినూత్న నిరసనలయం విరాళాల చోరీ వివాదంపై ఎంపీ పప్పు యాదవ్ పార్లమెంట్ లో వినూత్న స్కిట్ ప్రదర్శించారు. సన్యాసి వేషధారణలో ఆయన విరాళాలు సేకరించగా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఖర్గే తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. ఈ వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపల, వెలుపల తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నాయి.

స్పెయిన్‌లోకి భారీగా వలసదారులు

మొరాకో-స్పెయిన్ సరిహద్దులోని సెయూటా నగరం వద్ద భారీ వలస సంక్షోభం నెలకొంది. మొరాకో నుంచి వేలాది మంది సముద్రాన్ని ఈదుకుంటూ స్పెయిన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. యూరప్‌లోకి ప్రవేశానికి కీలక ద్వారమైన సెయూటాలో ఈ ఘటనకు మొరాకో రాజు క్షమాభిక్షలు, స్పెయిన్ కోర్టు తాజా తీర్పు వంటి అంశాలు కారణమై ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక స్పష్టత లేదు.

నన్ను అరెస్ట్‌ చేస్తే.. రంగంలోకి స్పెషల్‌ ఫోర్స్‌

ఐసీసీ వారంట్‌ ఆధారంగా న్యూయార్క్‌కు వస్తే అరెస్ట్‌ చేయాలన్న మేయర్ జోహ్రాన్‌ మమ్దానీ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా పర్యటన సందర్భంగా తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు. తనపై నకిలీ వారంట్లు జారీ చేసిన ఐసీసీని అవినీతిమయమైన సంస్థగా అభివర్ణిస్తూ, మమ్దానీ వ్యాఖ్యలు యూదులపై విద్వేషాన్ని రెచ్చగొట్టడానికేనని ఆయన దుయ్యబట్టారు.

సినిమా షూటింగ్‌లో రష్మికకు గాయాలు..

సినిమా షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తుండగా నటి రష్మిక మందన్న తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె నడము భాగానికి బలమైన గాయమవడంతో ఆరు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ వార్త తెలిసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల్లో ఆకాంక్షిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports