పారా అథ్లెట్లు సైతం తమ సత్తా చాటి పసిడి పతకం సాధించారు. అథ్లెటిక్స్‌లోని ట్రిపుల్ జంప్ విభాగంలో మన అథ్లెట్లు డబుల్ పోడియంతో అదరగొట్టారు. జూడో క్రీడలో కూడా మన క్రీడాకారులు సగర్వంగా పతకాలు సాధించారు.
ప్రీతి పవార్: మహిళల 54 కేజీల బాక్సింగ్ ఫైనల్లో కెనడా బాక్సర్‌ను చిత్తు చేసి స్వర్ణం సాధించింది.
జైస్మిన్ లాంబోరియా: 57 కేజీల బాక్సింగ్ తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఓడించి పసిడి పతకం కొట్టింది.
సాక్షి చౌదరి: 51 కేజీల బాక్సింగ్‌లో ఇంగ్లాండ్ క్రీడాకారిణిపై ఏకగ్రీవ విజయంతో స్వర్ణం దక్కించుకుంది.
ప్రియా ఘంగాస్: మహిళల 60 కేజీల బాక్సింగ్ విభాగంలో సత్తా చాటి స్వర్ణం సొంతం చేసుకుంది.
అరుంధతి చౌదరి: మహిళల 70 కేజీల బాక్సింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం దక్కించుకుంది.
సోమన్ రాణా: పారా షాట్‌పుట్ F57 విభాగంలో అత్యుత్తమ త్రో విసిరి భారత్‌కు స్వర్ణం గెలుచుకున్నాడు.
జదుమణి సింగ్: పురుషుల 55 కేజీల బాక్సింగ్ ఫైనల్లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చి రజతం సాధించాడు.
ప్రవీణ్ చిత్రవేల్: అథ్లెటిక్స్ పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచి రజతం కొల్లగొట్టాడు.
శుభమ్ జుయాల్: పారా షాట్‌పుట్ F57 విభాగంలో సోమన్ రాణాతో పాటు అద్భుతంగా పోటీపడి రజతం దక్కించుకున్నాడు.
సెల్వ ప్రభు తిరుమరన్: పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో సత్తా చాటి దేశానికి కాంస్యం సొంతం చేసుకున్నాడు.
ఉన్నతి శర్మ: మహిళల 63 కేజీల జూడో విభాగంలో అద్భుత ఆటతీరు కనబరిచి కాంస్య పతకం తన ఖాతాలో వేసుకుంది.
హర్ష్ తోకాస్: పురుషుల 81 కేజీల జూడో విభాగంలో కాంస్య పతకం సాధించాడు.
రమేష్ షణ్ముగం: పారా అథ్లెటిక్స్ పురుషుల 1500 మీటర్ల T54 ఫైనల్లో కాంస్యం గెలుచుకున్నాడు.
రాబోయే మ్యాచుల్లో మరింత మంది భారత క్రీడాకారులు ఫైనల్స్ ఆడనుండటంతో దేశ పతకాల పట్టిక మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విజయాలతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.













