Last Updated:
దర్శక ధీరుడు రాజమౌళి ‘సై’ సినిమాలో భిక్షు యాదవ్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి చెందారు. 74 ఏళ్ల ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.
సై సినిమాలో భిక్షు యాదవ్‌గా తెలుగు ప్రజలకు పరిచయమైన నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 74 ఏళ్ల ప్రదీప్ రావత్.. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. బాలీవుడ్‌లోనూ ‘లగాన్’, ‘గజినీ’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రదీప్ రావత్ మరణ వార్త తెలిసి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్డేట్లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.














