Last Updated:
టీటీడీ ఉద్యోగి జలకర గిరిధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవారి సేవా టికెట్లు, ఉద్యోగాల పేరుతో భక్తులను మోసం చేసినట్లు గుర్తించారు.
తిరుమలలో శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో సస్పెండ్ అయిన టీటీడీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను టీటీడీలో పేష్కార్గా పనిచేస్తున్నానని నమ్మిస్తూ.. అధికారులతో పరిచయాలు ఉన్నాయని చెప్పి భక్తులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి కోలా స్ట్రీట్‌కు చెందిన జలకర గిరిధర్ (34)ను తిరుమల II టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.














