CM Vijay: విజయ్ సర్కార్‌కు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు! | | ACTPnews

News18


Last Updated:

కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నిర్ణయంతో బాధిత కుటుంబాలకు కాస్త ఊరట లభించింది.

News18
News18

గత ఏడాది సెప్టెంబర్ నెలలో కరూర్ పట్టణంలో జరిగిన ఘోర తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మృతుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ ప్రభుత్వ ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports