Last Updated:
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఒక్కరోజు ముందు దేశ రాజధాని ఢిల్లీని బాంబు బెదిరింపులు వణికించాయి. రెడ్ ఫోర్ట్, ఐజీఐ ఎయిర్పోర్ట్, ఢిల్లీ హైకోర్టు సహా పలు కీలక ప్రాంతాలను పేల్చేస్తామంటూ ఆగంతకుల నుంచి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు భద్రతా బలగాలను కలవరపెట్టేలా వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం నాడు ఏకంగా ఎర్రకోట (రెడ్ ఫోర్ట్), ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3, ఢిల్లీ హైకోర్టు లాంటి అత్యంత కీలకమైన ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకులు బెదిరించారు. ఈ ప్రదేశాలతో పాటు జామ్ నగర్ హౌస్, ఝండే వాలన్ భవనం, సాకేత్ ఎం.బీ ఆఫీస్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎం కార్యాలయాలకు సైతం ఇలాంటి హెచ్చరికలే వచ్చాయి.














