Last Updated:
బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, తన పార్ట్నర్ శుభ్రా శెట్టి తమ పదకొండేళ్ల ప్రేమ ప్రయాణంపై మొదటిసారి స్పందించారు. వయసు వ్యత్యాసం, పెళ్లి ఆలోచనలు, వారు ఎదుర్కొన్న విమర్శల గురించి జానిస్ సిక్వేరా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్, శుభ్రా శెట్టి దాదాపు పదకొండేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇన్నాళ్లూ తమ బంధాన్ని రహస్యంగా ఉంచిన ఈ జంట.. తాజాగా జానిస్ సిక్వేరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రేమ ప్రయాణం గురించి మొదటిసారి ఓపెన్‌గా మాట్లాడారు. ఫాంటమ్ ఫిల్మ్స్‌లో శుభ్రా శెట్టి గతంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవారు. అక్కడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. 2015లో తొలిసారిగా పబ్లిక్‌గా కనిపించగా, 2018లో తమ బంధాన్ని అనురాగ్ అధికారికంగా ప్రకటించారు. ముంబై నగరానికి దూరంగా ప్రస్తుతం ఈ జంట బెంగళూరులో ప్రశాంతంగా నివసిస్తోంది.














