Last Updated:
మృతుల్లో ఎక్కువ మంది ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సహాయ చర్యలపై ఆరా తీశారు.
పశ్చిమ బెంగాల్లోని భీర్భూమ్ జిల్లాలోని ఓ హోటల్లో భయంకరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకొని 8 మంది చనిపోగా.. 11 మందికి గాయాలయ్యాయి. 22 మందిని రెస్క్యూటీమ్ రక్షించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.














