Last Updated:
Tirupati: ప్రతిష్ఠాత్మక శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) ఆసుపత్రిలో శాశ్వత ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగుల ఆశలను కొందరు దళారులు సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
రాత పరీక్షలు కూడా నిర్వహించకముందే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అభ్యర్థులకు ఫోన్లు చేస్తూ లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్న ఉదంతం తిరుపతిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పేర్లు వాడుకుంటూ ఉద్యోగార్థులను బురిడీ కొట్టించేందుకు పక్కా వ్యూహంతో దళారులు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.














