Last Updated:
Vijay Sai Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది. ప్రజల కోసం జనం పక్షాన నిలబడేందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. గతంలో వైసీపీ కీలకనేతగా, రాజ్యసభ సభ్యుడిగా పదవులు చేపట్టిన విజయసాయిరెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు.
Vijay Sai Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది. ప్రజల కోసం జనం పక్షాన నిలబడేందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. గతంలో వైసీపీ కీలకనేతగా, రాజ్యసభ సభ్యుడిగా పదవులు చేపట్టిన విజయసాయిరెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అటుపై కూటమి పార్టీలతో పాటు వైసీపీపై కూడా సున్నితమైన విమర్శలు చేసి పార్టీని వీడారు. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లుగా.. దానికి సంబంధించిన పూర్తి విధివిధానాల గురించి ఈనెలలోనే విజయవాడలో విస్తృత స్థాయి మీడియా సమావేశం నిర్వహించి తెలియజేస్తానన్నారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడతారనే వార్త కొత్తది కాకపోయినా అందుకు ఈనెలలోనే ముహుర్తం ఫిక్స్ చేయడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.














