Last Updated:
భారత్ వ్యవసాయ ఎగుమతుల్లో ఓ కీలక ఉత్పత్తి ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2025-26లో తొలిసారి $5 బిలియన్ మార్క్‌ను దాటిన బఫెలో మీట్ ఎగుమతులు.. 2026 ఏప్రిల్-జూన్‌లో ఏకంగా 66.6% వృద్ధి సాధించాయి.
భారత్ వ్యవసాయ ఎగుమతుల్లో బఫెలో మీట్ (గేదె మాంసం) కీలక స్థానాన్ని సంపాదించుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దీని ఎగుమతులు ఏకంగా 25.6 శాతం పెరిగి 5.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతేకాదు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ ఇదే దూకుడు కొనసాగుతోంది. 2026 ఏప్రిల్-జూన్ మధ్య బఫెలో మీట్ ఎగుమతులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 66.6 శాతం పెరిగి దాదాపు 1.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ విలువ 896.8 మిలియన్ డాలర్లుగా ఉంది.














