Last Updated:
Hyderabad: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాల్సిన కొందరు యువతీ యువకులు పెడదోవ పడుతున్నారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలతో చేతులు కలిపి నేరాల బాట పడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేసిన ఓ యువతితో పాటు బీటెక్ గ్రాడ్యుయేట్ కలిసి అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు సింథటిక్ డ్రగ్స్‌ను తీసుకొచ్చి విక్రయిస్తున్న కేరళకు చెందిన యువతి సహా మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.16.50 లక్షల విలువైన ఎండీఎంఏ (MDMA) మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.














