Last Updated:
Rishabh Pant: శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం భారత శిబిరంలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
అయితే పంత్ గాయంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కీలక అప్డేట్ ఇచ్చారు. అనంతరం రెండో రోజు ఆటలో అతడు బ్యాటింగ్‌కు దిగి అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. సారాన్ష్ జైన్ (6) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్.. స్వేచ్ఛగా షాట్స్ ఆడాడు. ఫలితంగా భారత జట్టు 400 మార్కును దాటింది. ఈ మధ్య పంత్ పదే పదే గాయాల బారిన పడుతున్నాడు. 2022 డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు.. ఆ తర్వాత ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. అనంతరం కమ్ బ్యాక్ చేసినా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో పేలవ ప్రదర్శన కారణంగా స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం కేవలం టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు.














