Tirumala Update: శ్రీవారి సేవలో ప్రముఖులు.. దర్శనానికి ఎంత టైమ్ పడుతోందంటే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఒక్క రోజే 4 కోట్ల కానుకలు 4 లక్షల లడ్డూలు.. తిరుమల అప్‌డేట్లు తెలుసుకోండి.

+

Tirumala Update: శ్రీవారి సేవలో ప్రముఖులు.. దర్శనానికి ఎంత టైమ్ పడుతోందంటే..

కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యగిరులు ఎప్పుడూ భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగుతుంటాయి. ఆపద మొక్కులవాడిని దర్శించుకుని తరించేందుకు సామాన్యులతో పాటుగా ఎందరో దేశ విదేశీ ప్రముఖులు తరలివస్తుంటారు. తాజాగా సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, ప్రముఖ సినీ నేపథ్య గాయని మంగ్లీ, పార్లమెంట్ సభ్యులు సనా సతీష్ బాబు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వీరంతా గర్భగుడిలో ఆనందనిలయం ముందు ఉన్న మూలవిరాట్టును కన్నులారా దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports