Last Updated:
ట్రైన్ ప్యాసింజర్లకు అదిరే తీపికబురు. ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఛర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి మీదుగా నడిచే బిలాస్పూర్ – యలహంక – బిలాస్పూర్ వారపు ఎక్స్ప్రెస్ రైలును రెగ్యులరైజ్ చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో ఏ. శ్రీధర్ ఈ మేరకు అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేశారు.














