Anasuya: పెద్ది వివాదం.. దర్శకులకు ఇచ్చిపడేసిన అనసూయ, సినిమాలపై సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

పెద్ది చిత్ర యూనిట్‌పై వస్తున్న విమర్శలపై ప్రముఖ నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ పరోక్షంగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

News18
News18

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నప్పటికీ, మరోవైపు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన జాన్వీ కపూర్ పాత్రను కేవలం గ్లామర్ కోసమే పరిమితం చేశారంటూ, మహిళలను కించపరిచేలా కొన్ని సీన్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్‌పై వస్తున్న విమర్శలపై ప్రముఖ నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ పరోక్షంగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా అనేది కేవలం సమాజానికి ప్రతిబింబం మాత్రమేనని, సమాజాన్ని మార్చాల్సిన పూర్తి బాధ్యతను చలనచిత్రాలపైనే నెట్టేయడం సరికాదని అనసూయ అభిప్రాయపడ్డారు. వెండితెరపై ఏది మంచి, ఏది చెడు అని విశ్లేషించుకునే విచక్షణ ప్రేక్షకులకు ఉండాలని, సినిమాలను చూస్తూ పిల్లలను పెంచడం కరెక్ట్ కాదని ఆమె హితవు పలికారు. అయితే, అదే సమయంలో కథలు రాసే రచయితలు, దర్శకులు కూడా తమ సామాజిక బాధ్యతను మర్చిపోకూడదని గుర్తుచేశారు. ఎందుకంటే సమాజంలో ప్రజల ఆలోచనలను, ప్రవర్తనను ప్రభావితం చేసే అపారమైన శక్తి సినిమాకు ఖచ్చితంగా ఉంటుందని ఆమె నొక్కి చెప్పారు.

గతంతో పోలిస్తే ప్రస్తుత సినిమాల్లో క్యారెక్టరైజేషన్లు చాలా గందరగోళంగా మారిపోయాయని అనసూయ ఆందోళన వ్యక్తం చేశారు. “ఒకప్పుడు సినిమాల్లో హీరో అంటే మంచివాడని, విలన్ అంటే చెడ్డవాడని స్పష్టత ఉండేది. కానీ ఈ రోజుల్లో సినిమాలో ఒక చెడును కేవలం చూపించారా? లేక ఆ చెడునే గ్లోరిఫై చేస్తూ (గొప్పగా) చూపించారా? అనే తేడా ప్రేక్షకులకు అర్థం కాకుండా పోతోంది” అని ఆమె విమర్శించారు. తాను ఇలాంటి విషయాలపై మాట్లాడినప్పుడు కొందరు తనను టార్గెట్ చేస్తూ తప్పుబడుతుంటారని, కానీ తన ఉద్దేశం సినిమాలను ఆపడం కాదని, సమాజం పట్ల మేకర్స్‌కు, ఆడియన్స్‌కు ఒక బాధ్యత ఉండాలనేదే తన తాపత్రయమని స్పష్టం చేశారు.

తన సిద్ధాంతాల కోసం గతంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా ఈ సందర్భంగా అనసూయ ప్రస్తావించారు. గతంలో ఒక పెద్ద టెలివిజన్ రియాలిటీ షో నుండి తప్పుకోవడానికి తన సిద్ధాంతాలే కారణమని చెప్పారు. తన అభిప్రాయాల వల్ల షో క్రియేటివిటీ దెబ్బతింటుందని కొందరు అన్నారని, ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకు టాలెంట్ ఉన్నా కూడా సరైన అవకాశాలు రాకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాను నమ్మిన నిజం కోసం నిలబడటంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. తప్పును ప్రశ్నించడం అంటే సినిమా స్వేచ్ఛను అడ్డుకోవడం కాదని, అది సమాజంలో మంచి మార్పుకు దారితీస్తుందని.. ఇకనైనా సినిమా వాళ్లు, చూసే ప్రేక్షకులు మరింత బాధ్యతగా ఉంటారని ఆశిస్తున్నట్లు అనసూయ ముగించారు. అంటే ఇది పెద్ది సినిమాలో లోపాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న నెటిజన్లను ఉద్దేశించే అని అర్థమవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *