తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేంద్ర ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ రూ.10,000 కోట్లకు పైగా వ్యయంతో బహుళ రైల్వే ట్రాక్ల విస్తరణ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అరక్కోణం – రేణిగుంట సెక్షన్లో (77 కి.మీ) 3, 4వ రైల్వే లేన్ల నిర్మాణం, అలాగే తెలంగాణలోని ఘట్కేసర్ – కాజీపేట సెక్షన్లో (110 కి.మీ) 4వ రైలు మార్గం విస్తరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కీలక రైల్వే కారిడార్ల వల్ల సికింద్రాబాద్-కాజీపేట, తిరుపతి-చెన్నై మార్గాల్లో రైళ్ల రద్దీ తగ్గి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా సరుకు రవాణా సామర్థ్యం పెరగనుంది.













