Ashwini Vaishnaw | హైదరాబాద్-అమరావతి బుల్లెట్ రైలుజస్ట్ గంటలో వెళ్లొచ్చు.. | ACTPnews

Ashwini Vaishnaw | హైదరాబాద్-అమరావతి  బుల్లెట్ రైలుజస్ట్ గంటలో వెళ్లొచ్చు..



ఆంధ్రప్రదేశ్ రైల్వే చరిత్రలో మంగళవారం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీకి వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ – అమరావతి మధ్య బుల్లెట్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 70 నిమిషాలకు తగ్గుతుందని, ఈ ప్రాజెక్టును 7-8 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఏపీ ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1, 2026 నుండి అధికారికంగా పని చేయడం ప్రారంభిస్తుందని వెల్లడించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి కేవలం రూ. 886 కోట్లు ఇచ్చేవారని, ఇప్పుడు ఒక్క ఏపీకే రూ. 10,134 కోట్ల బడ్జెట్ కేటాయించామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ. 1.06 లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు సాగుతున్నాయని మంత్రి తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *