Last Updated:
పోలీస్ కావాలని కలలు కన్నాడు.. కానీ, ఆ కలలకు బిగ్ బాస్ ఫుల్ స్టాప్ పెట్టింది. ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో పాల్గొన్న ఓ కుర్రోడి దీన కథ.
బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ ప్రారంభానికి ముందే వివాదాలు మరియు ఎమోషన్స్ తో వేడెక్కింది. కామనర్స్ ను హౌస్ లోకి పంపేందుకు స్టార్ మా ‘అగ్ని పరీక్ష సీజన్ 2’ను నిర్వహించిన సంగతి తెలిసిందే. మాజీ కంటెస్టెంట్లు అభిజిత్, బిందు మాధవి, నవదీప్ న్యాయనిర్ణేతలుగా.. యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో ద్వారా వందలాది మంది నుంచి కేవలం 15 మందిని ఎంపిక చేశారు. అయితే, వారిలో ఆరుగురికి మాత్రమే మెయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది. ఈ క్రమంలో శ్రీకాకుళం కుర్రాడు రామకృష్ణకు అన్యాయం జరిగిందనే వాదన నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.














