Last Updated:
ఇరాన్ ఒక వైపు.. అమెరికా, పాశ్చాత్య దేశాలకు దగ్గరగా ఉన్న యూఏఈ మరోవైపు.. పశ్చిమాసియా సంక్షోభంపై ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పుడు BRICS సదస్సుపై ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. భారత్ ఈ రెండు దేశాలను ఎలా సమన్వయం చేయబోతోంది? ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధ్యమవుతుందా?
BRICS Summit 2026: న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 18వ BRICS సదస్సు భారత్‌కు కీలక దౌత్య పరీక్షగా మారుతోంది. పశ్చిమాసియా సంక్షోభంపై ఇరాన్, యూఏఈ దేశాలు భిన్నమైన వైఖరులతో ఉండటంతో ఈ విభేదాలు BRICS వేదికపై ప్రభావం చూపకుండా చూడటం భారత్ ముందున్న ప్రధాన సవాల్‌గా మారింది. అదే సమయంలో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయంతో ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదింపజేయడంతో పాటు, కూటమి ప్రధానంగా ఆర్థిక అంశాలపై దృష్టి సారించేలా చేయాలని న్యూఢిల్లీ భావిస్తోంది. ఈ ఏడాది BRICS చైర్‌గా భారత్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇరాన్, యూఏఈ మధ్య సమతుల్యత సాధించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.














