CBSE రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్‌లో లోపాలు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర కీలక ఆదేశం | | ACTPnews

News18


Last Updated:

సీబీఎస్ఈ రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్‌లో సాంకేతిక లోపాల వల్ల ఫీజులు వేలల్లో చూపించడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సమస్యలను పరిష్కరించడానికి ఐఐటీ నిపుణులను రంగంలోకి దించుతూ ఆదేశాలు జారీ చేశారు.

News18
News18

సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత మార్కుల పునఃపరిశీలన (రీ-ఇవాల్యుయేషన్) పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలను పరిష్కరించడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ సంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాలను రంగంలోకి దించాలని సీబీఎస్ఈ బోర్డును ఆదేశించారు. ఈ ఏడాది బోర్డు పరీక్షల ఫలితాల అనంతరం రీ-ఇవాల్యుయేషన్ వెబ్‌సైట్ సరిగ్గా పనిచేయకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వెబ్‌సైట్ సర్వర్లు నిలిచిపోవడం, పేమెంట్ విధానంలో లోపాలు రావడంపై కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందించారు. సాంకేతిక వ్యవస్థను పూర్తిగా పరిశీలించి లోపాలు లేని పోర్టల్‌ను సిద్ధం చేయాలని ఐఐటీ నిపుణుల బృందానికి బాధ్యతలు అప్పగించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.

లోపాలపై నివేదిక – ఐఐటీ నిపుణుల రంగప్రవేశం

వెబ్‌సైట్ ప్రారంభమైనప్పటి నుండి ఎదురవుతున్న అన్ని సాంకేతిక సమస్యలను ఐఐటీ నిపుణుల బృందాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. పోర్టల్ స్థిరత్వం, సర్వర్ పనితీరును మెరుగుపరచడంతో పాటు ఐటీ మౌలిక సదుపాయాల పటిష్టతను వారు సమీక్షిస్తారు. లాగిన్ అథెంటికేషన్, యూజర్ యాక్సెస్ సిస్టమ్స్, పేమెంట్ గేట్‌వేలు కచ్చితంగా పనిచేసేలా అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపడతారు. ఈ ఘోర సాంకేతిక వైఫల్యాలపై సీబీఎస్ఈ బోర్డు నుండి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమగ్ర నివేదికను కోరారు.

ఫీజుల గందరగోళం – దరఖాస్తు గడువు పెంపు

ఈ నెలలో సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు వచ్చిన తర్వాత మార్కుల వెరిఫికేషన్, జవాబు పత్రాల ఫొటోకాపీల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెబ్‌సైట్ క్రాష్ అవ్వడం, ఫీజు చెల్లింపులు విఫలం కావడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. సాధారణంగా ఒక్కో సబ్జెక్టు ఫొటోకాపీకి వంద రూపాయల ఫీజు ఉండాలి. కానీ పోర్టల్‌లో సాంకేతిక లోపం వల్ల ఒక్కో సబ్జెక్టుకు వింతగా 8000, 67000, చివరికి 69,420 రూపాయల వరకు ఫీజు చూపిస్తున్న స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గడువు పొడిగించిన బోర్డు కార్యదర్శి

విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి వచ్చిన తీవ్రమైన ఫిర్యాదుల నేపథ్యంలో సీబీఎస్ఈ స్పందించింది. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు బోర్డు కార్యదర్శి హిమాన్షు గుప్తా కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కుల పునఃపరిశీలన దరఖాస్తు చివరి గడువును మే 23 నుండి మే 24 వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఐటీ బృందాల సహాయంతో ఈ సాంకేతిక సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించి, విద్యార్థులకు పారదర్శకమైన, సులువైన సేవలను అందిస్తామని విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports