Last Updated:
మొన్నటి వరకు పరాజయం లేని జట్టుగా సాగిన పంజాబ్ కింగ్స్‌కు వరుసగా రెండు ఓటములు ఎదురవ్వడం గమనార్హం. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్‌లో ఉన్నప్పటికీ.. ఆర్సీబీ తన తర్వాతి పోరులో నెగ్గితే ఆ జట్టు టాప్ ప్లేస్ చేరనుంది.
PBKS vs GT: పంజాబ్ కింగ్స్ (PBKS vs GT)కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్ (GT vs PBKS)తో జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. మొన్నటి వరకు పరాజయం లేని జట్టుగా సాగిన పంజాబ్ కింగ్స్‌కు వరుసగా రెండు ఓటములు ఎదురవ్వడం గమనార్హం. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్‌లో ఉన్నప్పటికీ.. ఆర్సీబీ తన తర్వాతి పోరులో నెగ్గితే ఆ జట్టు టాప్ ప్లేస్ చేరనుంది. 164 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి ఛేదించి నెగ్గింది. తద్వారా సీజన్లో 6వ విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం 12 పాయింట్లతో లీగ్ టేబుల్లో 5వ స్థానానికిి చేరుకుంది. ఛేదనలో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. వాషింగ్టన్ సుందర్ (23 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్సర్) మిగతా పనిని పూర్తి చేశాడు.
స్వల్ప లక్ష్య ఛేదన అయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ తడబడింది. గిల్ (5) నిరాశ పరిచాడు. బట్లర్ (26) ఫర్వాలేదనిపించాడు. నిశాంత్ సిందు (15) ఒకే అనిపించాడు. అయితే కీలక భాగస్వామ్యం సాయిసుదర్శన్, వాషింగ్టన్ సుందర్‌ల మధ్య నమోదైంది. వీరిద్దరు జట్టును లక్ష్యాన్ని చేరువగా తీసుకొచ్చారు. చివర్లో గుజరాత్ టైటాన్స్ వెంట వెంటనే వికెట్లను కోల్పోయినా వాషింగ్టన్ సుందర్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు రెండో ఓవర్లోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (5) అవుట్ కావడంతో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే, సాయి సుదర్శన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. జోస్ బట్లర్ (26)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించిన సుదర్శన్, 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
చివరి ఓవర్లలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి 12 బంతుల్లో 17 పరుగులు అవసరమైన దశలో, అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్లో హోల్డర్ వికెట్ కోల్పోయి కేవలం 6 పరుగులే రావడంతో సమీకరణం చివరి ఓవర్లో 11 పరుగులకు చేరింది. అర్షద్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్లో మొదటి నాలుగు బంతులకు 8 పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతులకు 3 పరుగులు కావాల్సిన సమయంలో, వాషింగ్టన్ సుందర్ (40 నాటౌట్; 23 బంతుల్లో) ఐదో బంతికి కళ్లు చెదిరే సిక్సర్ బాది గుజరాత్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేసింది. సూయాశ్ షెడ్జె (29 బంతుల్లో 57; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మార్కస్ స్టొయినిస్ (40) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ఎవరూ కూడా రాణించలేదు. చివర్లో మార్కో యాన్సెన్ (20) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ కింగ్స్ 160 మార్కును దాటగలిగింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 4 వికెట్లతో మెరిశాడు. సిరాజ్, కగిసో రబడలకు చెరో 2 వికెట్లు దక్కాయి.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













