DC vs RR: రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్.. రాణించిన టాప్ ఆర్డర్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

credit: x


Last Updated:

రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 20 ఓవర్లలో 193 పరుగులు సాధించింది. వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ బ్యాటింగ్‌తో రాణించారు.

credit: x
credit: x

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ (46; 5 ఫోర్లు, 3 సిక్సులు), రియాన్ పరాగ్ 53 (3 ఫోర్లు, 5 సిక్సులు), ధ్రువ్ జురెల్ (53; 5 ఫోర్లు, 2 సిక్సులు ) అద్భుతంగా రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు సాధించింది. ఒక దశలో స్కోర్ 230 వరకు ఈజీగా కొట్టేస్తారని అనిపించినా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు వేగంగా పరుగులు చేయలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు స్కోర్ తగ్గిపోయింది. ముఖ్యంగా స్టార్క్ వేసిన 15వ ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టి.. రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో రాజస్థాన్ స్కోర్ 193 పరుగులకే పరిమితమైంది. ఇక ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. మాధవ్ తివారీ 2, లుంగీ ఎంగిడి చెరో 2 వికెట్లు తీసుకున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *