Dhurandhar 2: ఓటీటీలో దురంధర్ 2 హవా.. భారీ రెస్పాన్స్‌తో కుమ్మేస్తోంది భయ్యా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

థియేటర్లలో కాసుల వర్షం కురిపించి, ఇండియన్ సినీ బాక్సాఫీస్ చరిత్రలోనే అపూర్వ రికార్డులు సృష్టించిన విజువల్ వండర్ ‘ధురంధర్: ది రివెంజ్’. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే స్థాయి బీభత్సాన్ని సృష్టిస్తూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది.

News18
News18

థియేటర్లలో కాసుల వర్షం కురిపించి, ఇండియన్ సినీ బాక్సాఫీస్ చరిత్రలోనే అపూర్వ రికార్డులు సృష్టించిన విజువల్ వండర్ ‘ధురంధర్: ది రివెంజ్’. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే స్థాయి బీభత్సాన్ని సృష్టిస్తూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ప్రముఖ ఓటీటీ ‘జియోహాట్‌స్టార్’ (JioHotstar) వేదికగా విడుదలైన ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్‌లపై సరికొత్త సంచలనాలకు తెరలేపింది. స్ట్రీమింగ్ ప్రారంభమైన మొదటి వీకెండ్‌లోనే ఏకంగా 50 మిలియన్ల (5 కోట్లు) వీక్షణలను (Views) సొంతం చేసుకుని ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది.

థియేట్రికల్ ఓపెనింగ్స్ కంటే 5 రెట్లు ఎక్కువ ఫుట్‌ప్రింట్‌! సినిమా హాల్స్‌లో సాధించిన అద్భుత విజయం ఒక ఎత్తయితే, డిజిటల్ రంగంలో ఈ చిత్రం సృష్టిస్తున్న ప్రభంజనం మరో ఎత్తు. థియేటర్లలో నమోదైన ప్రేక్షకుల సంఖ్యతో పోలిస్తే, ఓటీటీలో ఐదు రెట్లు ఎక్కువ ఫుట్‌ప్రింట్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ భారీ విజయంతో భారతీయ ఓటీటీ మార్కెట్లో జియోహాట్‌స్టార్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి ఘనంగా చాటుకుంది. పాన్-ఇండియా లెవెల్లో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ.. భాషా బేధాలు లేకుండా సినీ ప్రియులను కట్టిపడేస్తోంది.

కనెక్టెడ్ టీవీ యూజర్ల హవా.. ప్రత్యేక కంటెంట్ ప్లస్ పాయింట్!

ఈ చిత్రానికి వచ్చిన మొత్తం వీక్షణలలో దాదాపు 60 శాతం వ్యూస్ ‘కనెక్టెడ్ టీవీ’ (Smart TV) డివైజెస్ ద్వారానే రావడం విశేషం. అంటే ప్రేక్షకులు తమ కుటుంబాలతో కలిసి హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదించారు. ప్రేక్షకులకు కేవలం సినిమా మాత్రమే కాకుండా, ఒక అద్భుతమైన డిజిటల్ ప్రీమియర్ ఫీలింగ్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేసిన వ్యూహం అద్భుతంగా పనిచేసింది. థియేటర్లలో కట్ చేసిన కొన్ని సరికొత్త సీన్స్, ఎక్స్‌టెండెడ్ కట్, బిహైండ్-ది-సీన్స్ (BTS) విజువల్స్, చిత్ర యూనిట్ ప్రత్యేక ఇంటర్వ్యూలను కూడా ఓటీటీలో చేర్చడంతో అభిమానులు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

పార్ట్-1 రికార్డులు బద్దలు.. రూ. 1800 కోట్ల క్లబ్ మూవీ!

గతంలో విడుదలైన పార్ట్-1 ‘ధురంధర్’ ఓటీటీలో మొదటి మూడు రోజుల్లో 32 మిలియన్ల వ్యూస్ సాధించి అప్పట్లో రికార్డు సృష్టించగా.. ఇప్పుడు పార్ట్-2 ఆ రికార్డును సునాయాసంగా బద్దలు కొట్టి 50 మిలియన్లతో నాన్-స్టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా, లాంగ్ రన్‌లో ఓటీటీ వేదికగా మరెన్ని ఆల్‌టైమ్ రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. ఒకవేళ మీరు ఇంకా ఈ ప్రతీకార జ్వాల ‘ధురంధర్ 2’ని చూడకపోతే, ఇప్పుడే జియోహాట్‌స్టార్‌లో చూడొచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports