Last Updated:
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చారిత్రాత్మక ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమం ‘X’వేదికగా పంచుకుంటూ, డీఆర్డీఓ వరుసగా మూడు క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని అధికారికంగా ప్రకటించారు.
DRDO: దేశ వ్యూహాత్మక రక్షణ సన్నద్ధతను మరింత బలోపేతం చేస్తూ భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) శనివారం ఒకేసారి పలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను విజయవంతంగా పరీక్షించింది. ఆకాశమార్గం, సముద్ర మార్గాల ద్వారా దేశానికి పొంచి ఉన్న అనేక రకాల క్షిపణి ముప్పులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని ఈ పరీక్షల ద్వారా భారత్ నిరూపించుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చారిత్రాత్మక ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమం ‘X’వేదికగా పంచుకుంటూ, డీఆర్డీఓ వరుసగా మూడు క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని అధికారికంగా ప్రకటించారు.
రక్షణ మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రయోగాల సమయంలో మల్టీ-లేయర్డ్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (BMD) వ్యవస్థ సుదూర ప్రాంతాల నుండి దూసుకొచ్చే శత్రువుల లాంగ్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి లక్ష్యాలను గాల్లోనే విజయవంతంగా అడ్డుకుని, వాటిని ముక్కలు ముక్కలు చేసింది.
“సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులకు వ్యతిరేకంగా మల్టీ-లేయర్డ్ డిఫెన్స్‌ను మరియు మధ్యస్థ శ్రేణి యాంటీ-షిప్ (నౌక విధ్వంసక) సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి వరుసగా మూడు క్షిపణి పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఇందులో ఇంటర్‌సెప్టర్ క్షిపణులు తమ నిర్దేశిత లక్ష్యాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయి. భవిష్యత్తులో దేశానికి ఎదురయ్యే క్షిపణి ముప్పులను ఎదుర్కొనేందుకు సరికొత్త అధునాతన సాంకేతికతలతో ఈ వ్యవస్థలను రూపొందించడం జరిగింది.”
ఈ విజయవంతమైన ట్రయల్స్ ద్వారా.. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల (ICBMs) వంటి అత్యంత ప్రమాదకరమైన లాంగ్-రేంజ్ క్షిపణి ముప్పులను కూడా గాల్లోనే సమర్థవంతంగా అడ్డుకోగల అధునాతన సాంకేతికత కలిగిన ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన అగ్రదేశాల సరసన భారతదేశం నిలిచిందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని వ్యూహాత్మక ఆస్తులను, ప్రధాన నగరాలను (జనాభా కేంద్రాలను) శత్రువుల భారీ క్షిపణి దాడుల నుండి రక్షించడానికి ఇటువంటి రక్షణ వ్యవస్థలు అత్యంత కీలకమైనవని ఆయన తెలిపారు.
బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (BMD) పరీక్షలతో పాటు, డీఆర్డీఓ శనివారం సరికొత్త నావల్ యాంటీ-షిప్ మిస్సైల్-మీడియం రేంజ్ (NASM-MR) ను కూడా తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. సముద్రంలో మధ్యస్థ శ్రేణి దూరంలో ఉండే శత్రువుల నౌకలు లేదా యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుని, వాటిని పూర్తిగా నాశనం చేయడంలో భారతదేశానికి ఉన్న అసాధారణ సామర్థ్యాన్ని ఈ మేడెన్ ఫ్లైట్ టెస్ట్ (తొలి ప్రయోగం) నిరూపించింది. ఈ అద్భుత విజయాలు సాధించిన డీఆర్డీఓ శాస్త్రవేత్తలను, భారత సాయుధ బలగాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 13, 2026 12:05 PM IST













