Gang Rape Case: మైనర్‌పై సామూహిక అత్యాచారం.. గుడి పేరుతో చీటింగ్, ఓ లేడీతో పాటు ఇద్దరు అరెస్ట్ | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Gang Rape Case: ఈ నేరం ఎలా జరిగింది? బాధితురాలు ఎలా మోసపోయింది? ఏం జరిగిందో తెలుసుకుంటే.. అలాంటి ప్రమాదంలో ఇతరులు చిక్కుకోకుండా ఉంటారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

14 ఏళ్ల ఓ బాలికను మోసం చేసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరుకి దగ్గర్లోని దేవనహళ్లి పట్టణంలో జరిగింది. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన క్రైమ్. జులై 17న పొరుగున ఉండే రేణుక అనే మహిళ.. దేవనహళ్లి లోని గుడికి వెళ్దాం అని కోరింది. ఆ బాలిక సరే అంది. ఇద్దరూ కలిసి బయలుదేరారు. కొంత దూరం వెళ్లాక.. రేణుక.. ఆ బాలికను ఆటోలో వెళ్దామని.. ఆటో ఎక్కించింది. తాను మాత్రం ఆటో ఎక్కలేదు. ఆటోలో ఉన్న నవీన్, వెంకటరమణ.. ఆటోని గబగబా నడిపారు. ఆ దారిలో బాలికకు బలవంతంగా మద్యం తాగించారు.

బాలిక తనను వదిలేయాలనీ, ఇంటికి వెళ్తానని పట్టుబట్టింది. అయినా వాళ్లు వదల్లేదు “మద్యం మత్తులో ఉన్నావు, ఇంటికి వెళ్తే తండ్రి తిడతాడు” అని నమ్మబలికి, నిర్మాణంలో ఉన్న ఖాళీ భవనానికి తీసుకెళ్లి రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డారని ది హిందూ రిపోర్ట్ చేసింది. మర్నాడు ఉదయం బాలికను ఇంటి దగ్గర్లో దింపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి పారిపోయారు.

ఇవి కూడా చదవండి: Weather today: ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు.. 6 రోజులు దంచికొడతాయి.. బలంగా ఉపరితల చక్రవాత తుపాను

రాత్రంతా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి ఏమైందని ప్రశ్నించగా, బాలిక జరిగిన దారుణాన్ని వివరించింది. వెంటనే కుటుంబం దేవనహళ్ళి పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. పోలీసులు మైనర్ స్టేట్‌మెంట్ ఆధారంగా POCSO Act, గ్యాంగ్ రేప్, కిడ్నాప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేణుకను ప్రశ్నించి.. ఆమె ద్వారా.. మిగకా ఇద్దర్నీ గుర్తించి.. మొత్తంగా ముగ్గురినీ అరెస్ట్ చేశారు.

ఈ కేసులో నవీన్ ఆటో డ్రైవర్ అని తెలిసింది. వెంకటరమణపై ఇంతకు ముందు కూడా బాగేపల్లిలో మరో POCSO కేసు ఉంది. ఆటోను సీజ్ చేశారు. మెడికల్, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్లు పూర్తి చేశారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆందోళన, భయాన్ని సృష్టించింది. బాలిక సంక్షేమం కోసం కౌన్సెలింగ్, మెడికల్ సహాయం అందిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పిల్లల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పోలీసు అధికారులు సమాజంలో అప్రమత్తత పాటించాలనీ, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి రిపోర్ట్ చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి: Black Hole: మూడోసారి పేలిన బ్లాక్ హోల్.. విచిత్ర ప్రవర్తన చూసి షాకైన శాస్త్రవేత్తలు.. భూమికి ప్రమాదమా?

ఈ కేసు కర్ణాటకలో మైనర్లపై లైంగిక దాడులు పెరుగుతున్నట్లు సూచిస్తోంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి కానీ, ఈసారి పోలీసుల త్వరగా చర్యలు తీసుకోవడం మంచి విషయం. బాలిక కుటుంబం భద్రత కోసం పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం బాలికల భద్రత, మహిళా సంక్షేమం వైపు ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తోంది. పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed