Last Updated:
మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో గౌరి ప్రియా రెడ్డి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి.
మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో గౌరి ప్రియా రెడ్డి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. నిజానికి ఈ సినిమాపై జనాల్లో ఫుల్ పాజిటీవ్ హైప్ ఉంది. దానికి తోడు పాటలు, టీటర్, ట్రైలర్లు గట్రా అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి. ఇక ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగిందట.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.15 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్ రన్లో ఈ సినిమా హిట్టు కొట్టాలంటే.. రూ.16 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. నిజానికి ఈ సినిమాకు ప్రస్తుతం ఉన్న హైప్‌కు సినిమాకు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా సరే బ్రేక్ ఈవెన్ ఈజీగా అయిపోతుంది. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సాయి రాజేష్, ఎస్కేన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.
ఫస్ట్ మూవీ రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ అబ్బవరంపై జనాల్లో పాజిటీవ్ ఒపినీయన్ ఏర్పడింది. ఆ తర్వాత SR కళ్యాణ మండపం సినిమాతో కమర్షియల్ హిట్టు కొట్టి ఇండస్ట్రీలో తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. అయితే.. ఆ తర్వాత మాత్రం కిరణ్ అబ్బవరంను బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పలకరించాయి. అసలు కిరణ్ అబ్బవరం సినిమా వస్తుంటేనే అబ్బ ఏం చూస్తాంలే ఈయన సినిమాలు అనేంత వరకు జనాలు వెళ్లారు. ఇక కిరణ్ అబ్బవరం పని అయిపోయింది.. హీరోగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అనుకున్న టైమ్‌లో క సినిమాతో మాములు కంబ్యాక్ ఇవ్వలేదు.
ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరంను చూసే విధానమే మారిపోయింది. అసలు ‘క’ సినిమా కిరణ్ అబ్బవరం జీవితాన్నే మర్చేసింది. ఆ తర్వాత వచ్చిన K-ర్యాంప్ సినిమా కూడా కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్ హిట్టయింది. దాంతో కిరణ్ టాలీవుడ్లో టైర్ 3 హీరోగా సెటిల్ అయ్యాడు. ఇక ఇప్పుడ చెన్నై లవ్ స్టోరీ అంటూ మరో క్రేజీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా టైటిల్ గ్లింప్స్, ఆ తర్వాత రిలీన ‘గుర్తుందా.. గుర్తుందా’ సాంగ్స్‌తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ గెస్ట్‌గా రావడం కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














